జాతీయ వార్తలు

అలోక్ తొలగింపుచట్టవిరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే తప్పుపట్టారు. ఈమేరకు శనివారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ పదవి కుదించే అధికారం ఎవరికీ లేదని ఖర్గే తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. అలోక్‌వర్మను సీబీఐ డైరెక్టర్ పదవిలో కొనసాగించాలని ఆయన అభ్యర్థించారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే త్రిసభ్య కమిటీలో సభ్యునిగా కూడా ఉన్నారు. డైరెక్టర్ అలోక్ వర్మ విధులకు ఎవరూ ఆటంకం కల్పించలేరని, అలాగే ఆయనను సెలవుపై పంపే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష పార్టీనేత సభ్యులుగా ఉన్నారు. ముడుపుల ఆరోపణల నేపథ్యంలో డైరెక్టర్ అలోక్ వర్మను గతనెల 23న సెలవుపై పంపుతూ కేంద్రం ఆదేశాలిచ్చింది. అయితే కేంద్రం నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీబీఐ డైరెక్టర్ పదవీకాలాన్ని కుదించే అధికారం ఎవరికీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గానీ, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు గానీ డైరెక్టర్ అలోక్‌వర్మను సెలవుపై పంపించే అధికారం లేదని ఖర్గే తెలిపారు. అలోక్‌వర్మ విషయంలో కేంద్రం ఏకపక్షంగా, కక్షసాధింపుగా వ్యవహరిస్తోందని సుప్రీంకు ఆయన ఫిర్యాదు చేశారు. సీవీసీ ఆదేశించడానికి అసలు ఆ అంశం దాని పరిధిలోనిదే కాదని ఆయన పేర్కొన్నారు. ఖర్గే తన పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ ద్వారా సుప్రీంలో దాఖలు చేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం(డీఎస్‌పీఈ), సీవీసీ చట్టం కింద సీబీఐ డైరెక్టర్ పదవీ కాలం కుదించేందుకు వీల్లేదని, ఆయన రెండేళ్లు పదవిలో ఉంటారని కోర్టుకు తెలిపారు. అలాగే అలోక్‌వర్మ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు సభ్యుడినైన తనతో సంప్రదించనేలేదని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. గత నెల 23-24 అర్థరాత్రి సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, అదనపుప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానాను విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆయన కోర్టుకు తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ చరిత్రలో ఇలాంటి దురదృష్టకర సంఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.