జాతీయ వార్తలు

ఆ మూడు రాష్ట్రాల్లో పెచ్చుమీరిన అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలభూమి.....
============
జైపూర్, నవంబర్ 3: ప్రధాని నరేంద్రమోదీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేసిన విదేశీ పర్యటనల వల్ల ఉపయోగం లేదని ఎఐసీసీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. పెట్టుబడులు రాలేదని, నల్లధనం నిర్మూలనకు తీసుకున్న చర్యల వల్ల ప్రయోజనం కలుగలేదని ఆయన ధ్వజమెత్తారు. మోదీ నాలుగేళ్ల పాలనలో అమలు చేసిన విధానాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. బ్యాంకులకు కోట్లాది రూపాయలు బకాలు ఎగగొట్టి విదేశాలకు పరారైన మోసగాళ్లను రప్పించడంలో మోదీ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. విదేశాలకు సరదాగా ప్రయాణం చేయడం మోదీకి అలవాటైందన్నారు. ఈ పర్యటనల వల్ల దేశాభివృద్ధికి వచ్చిన లాభాలేమీ లేవన్నారు. మన దేశంలో బ్యాంకులను మోసం చేసి అనేక మంది విదేశాలకు పరారయ్యారన్నారు. మాల్యా, నీరవ్‌మోదీ, మెహుల్ చోస్కీ లాంటి దోపిడీదారులు దేశం వదిలిపెట్టి వెళ్లేందుకు మోదీ సర్కార్ సహకరించిందన్నారు. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మను కూడా సెలవుపై పంపించారన్నారు. రాఫెల్ ఒప్పందంపై సీబీఐ విచారణ జరిపేందుకు సిద్ధమవుతుండగా, సీబీఐలో చిచ్చుమొదలైందన్నారు. రాజస్తాన్, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అవినీతి పెచ్చుమీరిందన్నారు. రైతుల్లో అసహనం, అశాంతి పెరిగిందన్నారు. రైతాంగ సంక్షేమానికి మోదీ చేసిందేమీ లేదన్నారు.
ఈ రాష్ట్రాల్లో అవినీతి వల్ల పేదలకు సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అడ్డదార్లు తొక్కిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రచారానికి అలవాటు పడిందన్నారు. ఈ ప్రచారం బుట్టలో యువత, మహిళలు పడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రాజస్తాన్ రిపోర్టు కార్డు బూటకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆజాద్ కోరారు.