జాతీయ వార్తలు

మధ్య్రపదేశ్‌లో బీజేపీకి ముచ్చెమటలు.....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలభూమి.....
============
* మళ్లీ మేమే గెలుస్తాం: బీజేపీ * ఈ సారి పాగా వేస్తాం: కాంగ్రెస్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు తీవ్రమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 92 సీట్లు మాత్రమే వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పోలీసు నిఘా విభాగం నిర్వహించిన శాంపిల్ సర్వేలో వెల్లడైంది. ఈ నివేదికను ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్‌కు నిఘా పోలీసులు ఇచ్చారని సమాచారం. ఈ సమాచారం కాస్త ప్రాంతీయ, జాతీయ మీడియాకు లీకైంది. దీంతో బీజేపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 సీట్లు ఉన్నాయి. ఈ సారి మళ్లీ గెలుస్తామనే ధీమాతో బీజేపీ క్యాడర్ ఉంది. కాంగ్రెస్‌లో అంతర్గతకలహాలు, లోపించిన సయోధ్య వల్ల బీజేపి గెలుస్తుందని ఇంతకాలం ఆ క్యాడర్ కలలు కంది. ఈ అంతర్గత కలహాలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని బీజేపీ వ్యతిరేక ప్రభంజనం గట్టిగా ఉందని, కాంగ్రెస్ గెలుపు ఖాయమని నిఘా శాఖ నివేదిక
ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 128 సీట్లు వస్తాయని నిఘా అంచనా వేసింది. అదే సమయంలో బీఎస్పీకి 6 సీట్లు, ఎస్పీకి మూడు సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. గోండ్వానా గంటాత్ర పార్టీకి ఒక్క సీటు వస్తుందని భావిస్తున్నారు. బీఎస్పీ, ఎస్పీ, గోండ్వానా పార్టీలు ఓట్లను చీల్చుతాయని దీని వల్ల కాంగ్రెస్‌కు లాభిస్తుందని నిఘా విభాగం ప్రభుత్వానికి ఇచ్చిన సర్వేలో పేర్కొంది. బీజేపీ ఇప్పటికే 230 సీట్లలో 177 సీట్లకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయనుంది. బుద్నీ నుంచి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేస్తున్నారు. రాష్టమ్రంత్రులు నరోత్తమ్ మిశ్రా, యశోధర రాజే సింధియాలు ధాటియా, శివపురి అసెంబభ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న వారిలో 10 మంది గెలుస్తారని, మిగతా వారందరూ ఓటమి తథ్యమని సర్వేలోతేలింది. ముఖ్యమంత్రి సన్నిహితుడుగా ఉన్న సూర్యప్రకాశ్ మీనా పార్టీ టిక్కెట్ అక్కర్లేదని, పోటీ చేయనని ప్రకటించడం విశేషం. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీకి 24 నుంచి 34 అసెంబ్లీ సీట్లలో పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ సీట్లు ఎవరి ఖాతాలో పడుతాయో ఆ పార్టీ గెలుస్తుంది. గ్వాలియర్ చంబల్ డివిజన్‌లో పోటీ తీవ్రంగా ఉంటుందంటున్నారు. బీజేపీ ఏడు సీట్లలో గెలుస్తుందంటున్నారు. మిగిలిన సీట్లలో కాంగ్రెస్ స్వీప్ అవుతుందని నిఘా విభాగం జోస్యం చెబుతోంది. బుందేల్ ఖండ్ ప్రాంతంలో 26 సీట్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి 13, కాంగ్రెస్‌కు 12 సీట్లు, ఎస్పీకి ఒక సీటు వస్తుందంటున్నారు. వింధ్య ప్రాంతంలో 30 సీట్లలో కాంగ్రెస్‌కు 18 సీట్లు, బీజేపీకి 9 సీట్లు, బీఎస్పీకి మూడు సీట్లు వస్తాయని అంచనా. మహాకోశల్‌లో 38 సీట్లలో కాంగ్రెస్ 22 సీట్లు, బీజేపీకి 13 సీట్లు, ఎస్పీ 2 రెండు సీట్లు, గోండ్వానా పార్టీ ఒక సీటులో విజయం సాధించే అవకాశాలున్నాయని నిఘా విభాగం అంచనా వేసింది. మాల్వా-నిమర్‌లోకూడా కాంగ్రెస్‌ను ఎక్కువ సీట్లను వరించే అవకాశాలున్నాయి. ప్రతి ప్రభుత్వం నిఘా విభాగం ద్వారా ప్రాథమిక సర్వే నిర్వహించిలోటు పాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ ఎటూ 92 సీట్లలో గెలుస్తుందని, అదనంగా మరో 35 సీట్లలో లోపాలను సరిదిద్దుకుని గెలుపును సొంతం చేసుకోవాలని బీజేపీ ఉలీళ్లూరుతోంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్ వర్గాలు బాహాటంగా కత్తులు దూసుకుంటున్నాయి. ఈ విబేధాలను తమ గెలుపుకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ తాపత్రయపడుతోంది. ప్రస్తుతానికి ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలు దూసుకుపోతున్నా, రెండు పార్టీల్లో గుబులు మొదలైంది. కొన్ని ఎన్నికల సర్వేలు బీజేపీ గెలుస్తుందని, మరి కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించాయి.