జాతీయ వార్తలు

ముమ్మాటికీ నేరం, చట్టవిరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: మహారాష్ట్ర అడవుల్లో మనిషి మాంసం రుచి మరిగిన అవని అనే పెద్ద పులిని పాశవికంగా వధించడంపై కేంద్ర మంత్రి మేనకాగాంధీ ఆందోళన వ్యక్తం చేవారు. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వంతీరును ఆమె తప్పుబట్టారు. ఆడ పెద్దపులి కనీసం 13 మందిని చంపి తినడంతో గతరెండేళ్లుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అటవీ పోలీసులు వేటాడుతున్నారు. చివరకు శుక్రవారం రాత్రి ఆడ పెద్దపులిని అటవీ సిబ్బంది వధించారు. అవనికి రెండు పిల్లలు ఉన్నాయి. వీటి వయస్సు పదినెలలు. హైదరాబాద్‌కు చెందిన షార్ప్ షూటర్ ఆస్కర్ అలీ ఈ పెద్దపులిని కాల్చి చంపారు. రాలేగాన్ పోలీసు స్టేషన్ పరిధిలో 149వ నంబర్ బోరాటీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ పెద్దపులిని వధించేందుకు ఎలా అనుమతించారని ఆమె మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మ ఏరకు ఆమె వరుసగా ట్వీట్‌లు చేశారు. ఈ విషాద సంఘటన తనను చాలా బాధించిందని ఆమె చెప్పారు. ఇంత కంటే దారుణమైన నేరం మరొకటి ఉంటుందా అని ఆమె నిలదీశారు. జంతు ప్రేమికులు ఎంతోగానో బతిమలాడుతున్నారు. ఈ పెద్దపులిని ఏ విధంగానైనా పట్టుకోవాలని కోరార. కాని ప్రభుత్వం పెడచెవిన పెట్టి చంపేశారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మంత్రి ముంగట్వీట్ ఈ పెద్దపులిని కాల్చి చంపేందుకు ఆదేశాలు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. న్యాయపరంగా, చట్టపరంగా ఇది ముమ్మాటికీ నేరమన్నారు. ప్రైవేట్ షూటర్‌కు పెద్దపులిని చంపే బాధ్యతను ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రతి సారి షాఫట్ అలీ ఖాన్ సేవలు వినియోగించుకుంటున్నారని, ఈ సారి ఆయన కుమారుడి సేవలను వాడుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విధంగా పెద్దపులిని చంపేందుకు అనుమతి ఇవ్వడం అక్రమమని చెప్పారు. షాఫత్ అలీ ఖాన్ గతంలో 3 పెద్దపులులను, 10 చిరుత పులులను చంపారన్నారు. జాతివిద్రోహ శక్తులకు తుపాకులను సరఫరా చేసిన చరిత్ర షాఫత్ అలీ ఖాన్‌కు ఉందన్నారు. ఒక హత్య కేసులో కూడా నిందితుడని ఆమె పేర్కొన్నారు. అక్రమమైన, చట్టవిరుద్ధమైన పనులకు ఈ వ్యక్తి సేవలను ఎలా వాడుకుంటారని ఆమె నిలదీశారు. ఇప్పుడు మరణించిన ఆడ పెద్దపులికి రెండు పిల్లలు ఉన్నాయని, వాటి బాగోగులను ఎలా పట్టించుకుంటారని ఆమె నిలదీశారు. తల్లి లేని లోటు ఎవరు తీరుస్తారన్నారు. అన్ని దారులు మూసుకుపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ పెద్దపులిని కాల్చి చంపాల్సి వచ్చిందని మంత్రి ముంగట్వీర్ తెలిపారు. ఈ ఏడాది సుప్రీంకోర్టు కూడా ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు.