జాతీయ వార్తలు

ఆత్మహత్య చేసుకుందామని ఎన్నోసార్లు అనుకున్నా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 4: చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టించి దేశంలో ఎవరూ సాధించని రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జీవితం అంతా పూలపాన్పులా ఏమీ సాగలేదు.
ఆయన జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిపిన రోజులు ఉన్నాయి. అంతెందుకు తాను సినీ సంగీతదర్శకుడిగా రాకముందే ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలు చుట్టుముట్టేవని ఏఆర్ రెహమాన్ స్వయంగా తన ఆత్మకథలో పేర్కొన్నాడు. తాను ఈ స్థితికి చేరుకోవడానికి ఎన్నో ముళ్లబాటలు దాటానని, మరెన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నానని, ఈ జీవితం ఎందుకు? బతికి చేసేదేముంది అనుకుని తనువు చాలిద్దామని అనుకున్నానని ఆయన తెలియజేశారు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, ఒడిదుడుకులను వివరించే బయోగ్రఫీని ‘నోట్స్ ఆఫ్ ఎ డ్రీమ్’ పేరిట శనివారం విడుదల చేశారు. ప్రముఖ రచయిత కృష్ణత్రిలోక్ రాసిన ఈ పుస్తకాన్ని ల్యాండ్‌మార్కు, పెంగ్విన్ ర్యాండమ్ హౌసెస్ సహకారంతో విడుదల చేశారు. ఈ సందర్భంగా రెహమాన్ తన మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నారు.
ఒక సంగీత దర్శకుడిగా ఈ ప్రపంచం తనను గుర్తించడానికి ముందే తనలో ఉన్న మరో పార్శ్వాన్ని రెహమాన్ వెల్లడించారు. ‘జీవితంలో నేను ఎదుర్కొన్న అపజయాలు, ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలు రోజూ వచ్చేవి’ అని ఆయన తెలిపారు. తనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడే ఫిల్మ్-స్కోర్ కంపోజర్‌గా ఉండే తన తండ్రి మరణతో పాటు అనేక కష్టాలు తనను చుట్టుముట్టాయని, సంగీత వాద్యాలను అద్దెకు తెచ్చుకునే వారమని, అప్పటి నుంచే సంగీతంపై తనకు మక్కువ ఏర్పడిందని ఆయన చెప్పారు. 1992లో రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం కాకముందు వరకు జీవితంపై తాను చాలాసార్లు విసుగు చెందానని, ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నానని తెలిపాడు. తన అసలు పేరు దిలీప్‌కుమార్ అని కాని సూఫీ ఇస్లాంలోకి మారిన తర్వాత తన పేరును రెహమాన్‌గా మార్చుకున్నట్టు చెప్పారు. తన అసలు పేరును చెప్పుకోవడానికి తాను అస్సలు ఇష్టపడనని, ఆ పేరును ఎందుకు అసహ్యించుకుంటానో ఇప్పటికీ తనకు తెలియదని, బహుశా తనకు ఆ పేరు మ్యాచ్ కాకపోవడమే కారణమని అన్నారు. రెహమాన్‌గా పేరుమార్చుకున్న తర్వాత తన జీవితంలో పెనుమార్పు సంభవించిందని అన్నారు. రోజా చిత్రం తర్వాత వండర్‌కిడ్‌గా పేరుపొందిన రెహమాన్ సంగీతం గ్రామర్, సౌండ్స్‌నే మార్చేశారని ప్రశంసలు పొందాడు. సంగీత సృష్టి అన్నది ఒంటరి ప్రక్రియ కాదని, అది సంగీతకారుడి నుంచి అంతర్గతంగా పుట్టుకు వస్తుందని అన్నారు. మొదట మన అంతరంగం చెప్పే విషయాన్ని మనం ఆలకించాలని, ఇది చాలా కష్టమైన ప్రక్రియ అని, కాని ఒకసారి అలవాటైతే మనల్ని మనమే మరచిపోతామని ఆయన అన్నారు. అందుచేతే తాను ఉదయం 5-6 గంటల మధ్య, రాత్రుళ్లు పనిచేయడానికి ఇష్టపడతానని ఆయన చెప్పారు. నిత్యం కొత్తదనాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తానని, దీనికి తనకు ఎంమాత్రం అలసట, విసుగు రాదని చెప్పారు. తాను ఎంత బిజీగా ఉన్న తన కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తానని, అది తనకు కొత్తశక్తిని ఇస్తుందని పేర్కొన్నారు.