జాతీయ వార్తలు

పెట్రో ధరలకు మోదీ సర్కారు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో సతమతమవుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచవద్దని పెట్రోలియం కంపెనీలను ఆదేశించినట్లు తెలిసింది. కర్నాటక శాసనసభ ఎన్నికలు మే 12న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే బీజేపీ విజయావకాశాలు దెబ్బతింటాయని ఎన్డీయే ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే పెట్రోలు, డీజిల్ ధరలను పెంచకూడదని ఎన్డీయే ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు అనధికార ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నందున పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే లీటరుకు రెండు రూపాయలు పెంచాలని ఆయిల్ సంస్థలు భావించాయి. దీనికి సంబంధించిన ఫైల్‌ను ఆయా ఆయిల్ సంస్థలు కేంద్ర పెట్రోలియం శాఖకు పంపినట్టు చెబుతున్నారు. అయితే ప్రధాన మంత్రి కార్యాలయం వెంటనే జోక్యం చేసుకుని తాము తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు ధరలు పెంచవద్దని చమురు సంస్థలకు స్పష్టం చేసిందని అంటున్నారు. కర్నాటక శాసనసభ ఎన్నికలు జరిగిన అనంతరం నాలుగైదు నెలల్లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ప్రకియ ముగిసిన తరువాత మరో నాలుగు నెలలకే 2019 లోక్‌సభ ఎన్నికలు, తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, సిక్కిం శాసనసభల ఎన్నికలు వస్తాయి. మోదీ ప్రభుత్వం ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పెట్రో ధరలను పెంచవద్దని ఆయిల్ సంస్థలను ఆదేశించిందని అంటున్నారు. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగేంతవరకు పెట్రో ధరలను పెరగనివ్వకుండా జాగ్రత్త పడవచ్చునని ఆయిల్ సంస్థల అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో గత నాలుగేళ్లుగా చమురు ధరలు బాగా తగ్గుముఖం పట్టటం వలన ఎన్డీయే ప్రభుత్వం రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో ప్రయోజనం పొందింది. ఇప్పుడు చమురు ధరలు పెరగటం ప్రారంభం కావటంతో మోదీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. లోక్‌సభ ఎన్నికలు వచ్చేనాటికి చమురు ధరలు పెరిగితే ఎన్డీయేకు రాజకీయంగా నష్టం కలుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర బ్యారెల్‌కు యాభై డాలర్లుంటే బాగుంటుందని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే చమురును ఎగుమతి చేసే దేశాల్లో మొదటిదైన సౌదీ అరేబియా బ్యారెల్ చమురు ధరను 70 డాలర్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. దాని పర్యవసానంగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే బీజేపీకి రాజకీయంగా నష్టం కలుగుతుంది. అందుకే పెట్రో ధరలు పెంచవద్దని మోదీ ప్రభుత్వం మూడు ప్రముఖ చమురు సంస్థలకు అనధికార ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు. ప్రస్తుత విధానం ప్రకారం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ధరలను పెంచుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ ఆయిల్ సంస్థలకు అనధికార ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు.