జాతీయ వార్తలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: ప్రపంచంలోనే అత్యంత సహనం కలిగిన ప్రజలు హిందువులని పేర్కొంటూ అయోధ్యలోని రామమందిరం పరిధిలో మసీదును నిర్మించాలనే మాటలు వారిని అసహనపరులుగా మారుస్తాయని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తనతో కలిసి పునాది రాయి వేయాలని ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. రాహుల్ గాంధీ ఇలా పునాది రాయి వేయడం ద్వారా తన పార్టీ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుందని ఉమాభారతి పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే హిందువులు అత్యంత సహనం కలిగిన ప్రజలు. నేను అన్ని రాజకీయ పార్టీలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.. అయోధ్యలోని రాముడు జన్మించిన స్థలం బాహ్య కైవారంలో మసీదును నిర్మించాలని మాట్లాడటం ద్వారా హిందువులను అసహనపరులుగా మార్చొద్దు’ అని ఉమాభారతి ఆదివారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు. పవిత్రమయిన పట్టణం మదీనాలో ఒక ఆలయం లేనప్పుడు, వాటికన్ సిటీలో ఒక మసీదు లేనప్పుడు, అయోధ్యలో మసీదు ఉండాలని మాట్లాడటం అన్యాయమే అవుతుందని ఆమె అన్నారు. అయోధ్య వివాదం ఒక స్థల వివాదమే తప్ప విశ్వాసానికి సంబంధించిన వివాదం కాదని ఆమె అన్నారు. ‘ఇది ఇప్పుడు కేవలం స్థల వివాదమే. విశ్వాసానికి సంబంధించిన వివాదం కాదు. అయోధ్య రాముడు జన్మించిన స్థలమని నిశ్చయం అయిపోయింది’ అని ఫైర్‌బ్రాండ్ హిందూ నాయకురాలయిన ఉమాభారతి అన్నారు. ఈ అయోధ్య స్థల వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవలసిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆమె కోరారు. ‘మాకు ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీల మద్దతు అవసరం. నేను రాహుల్ గాంధీజీ సహా అన్ని పార్టీల నాయకులను నాతో పాటు రామ మందిర నిర్మాణానికి పునాది రాయి వేయడానికి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాను’ అని ఉమాభారతి అన్నారు. ఇలా చేయడం ద్వారా గాంధీ వంశస్తులు కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందవచ్చని ఆమె అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అడ్డంకులు సృష్టించిందని ఆమె ఆరోపించారు. రామమందిర నిర్మాణం అనేది జాతీయ ప్రయోజన అంశమని, అందువల్ల ఎస్‌పీ అధినేత ములాయం సింగ్, బెనర్జీ, మాయావతి, వామపక్షాలు ఈ విషయంలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఉమాభారతి అన్నారు.

ఏ శక్తీ అడ్డుకోజాలదు
లఖింపూర్ ఖేరి (యూపీ): అయోధ్యలో భారీ రామమందిర నిర్మాణాన్ని ఏ శక్తీ అడ్డుకోజాలదని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య అన్నారు. రామమందిర నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ గతంలోనూ, ఇప్పుడూ, భవిష్యత్తులోనూ అనుకూలమేనని ఆయన ఆదివారం ఇక్కడ స్పష్టం చేశారు. ‘ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అందువల్ల నేను దీనిపై వ్యాఖ్యానించను’ అని వౌర్య అన్నారు. అయితే, ‘సమయం వచ్చినప్పుడు భారీ రామమందిర నిర్మాణం జరుగుతుందనే ఒకే వాక్యాన్ని నేను నిర్దిష్టంగా చెప్పగలను’ అని ఆయన వెంటనే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని హిందూమత గురువులు ఒత్తిడి చేస్తుండటంపై అడిగిన ప్రశ్నలకు వౌర్య బదులిస్తూ ఈ విషయం చెప్పారు. హిందూ మత గురువులు, పీఠాధిపతుల మనోభావాలను తాను గౌరవిస్తానని ఆయన అన్నారు.