జాతీయ వార్తలు

సీఎం రేసులో లేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కు, బీజేపీకి వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ కుదురుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ జైపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మహాకూటమి గెలిస్తే ముఖ్యమంత్రి రేస్‌లో లేనని ఆయన స్పష్టం చేశారు. వయోభారం పడిందని, పైగా తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన చెప్పారు. ‘నేను పోటీలో లేనేలేను. ఆ ఆలోచనే లేనప్పుడు రేసులో ఎలా ఉంటాను. నాకు ఉండే ఇమేజి నాకుంది. నా పరిమితులు నాకు తెలుసు. నాకుండే శారీరక సమస్యలు నాకున్నాయి’ అని ఆయన అన్నారు.
ఇక్కడ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి తథ్యమని చెప్పారు. టీఆర్‌ఎస్ గెలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మితిమీరిన విశ్వాసంతో ఉన్నారని, కాని ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలతో మహాకూటమి అవతరించిందని చెప్పారు. నూటికి నూరుశాతం టీఆర్‌ఎస్ పార్టీకి మెజార్టీ రాదన్నారు. కనీసం సగం సీట్లు కూడా తెచ్చుకోని పక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మజ్లిస్, బీజేపీ మద్దతు తీసుకోవడానికి కేసీఆర్ వెనుకాడరని అన్నారు. ఈ పరిస్థితి తలెత్తదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మెజార్టీ సీట్లు వస్తాయన్నారు. రాహుల్‌ను ‘బఫూన్’ అని నిందించడాన్ని కేసీఆర్ గొప్పగా భావిస్తున్నారని.. కాని ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని అన్నారు. ఎన్నికలకు ముందుగా వెళ్లే నిర్ణయం తీసుకోవడంపై కేసీఆర్ కూడా ఈ రోజు ఆనందంగా ఉండకపోవచ్చని అన్నారు. ముందస్తు ఎన్నికలకు పోయారంటే కేసీఆర్ మంచి విశ్వాసంతో ఉన్నారని కొంతమంచి భావించారని.. అది నిజం కాదని చెప్పారు. మజ్లిస్ పార్టీకి పాత బస్తీలో బలం ఉన్న మాట వాస్తవమేనని.. వారి సీట్లు వారికి వస్తాయని అన్నారు. కాని హైదరాబాద్‌ను వదిలిపెట్టి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళితే మైనార్టీలు కాంగ్రెస్‌తోనే ఉంటారు.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని అన్నారు. కేసీఆర్‌ను వ్యతిరేకించే శక్తులు ఏకమవుతున్నాయని, కేసీఆర్ ప్రజా వ్యితిరేక విధానాలతో జనం విసిగిపోయి ఉన్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్న ఆరోపణలో నిజం లేదు. హైకమాండ్ సరైన సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటుంది. కేసీఆర్‌ను ఓడించడమే మహాకూటమి ముందున్న లక్ష్యమని అన్నారు. కేసీఆర్ ప్రజలను భ్రమల్లో ముంచి చేతకాని హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి డబుల్‌బెడ్ రూంలు కట్టించి ఇస్తామన్న హామీ ఏమైంది? ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇలాంటి హామీలను జనం నమ్మి ఓట్లు వేశారు. నాలుగున్నరేళ్ల తర్వాత ఈ హామీలన్నీ ఏమయ్యాయి అని నిలదీశారు. సర్వేలను నమ్మే ప్రసక్తిలేదని ఆయన చెప్పారు. ప్రజల్లో అభిప్రాయం మార్పు అనేది శరవేగంగా జరుగుతోందని, ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రజల అభిప్రాయాలు మారుతుంటాయని అన్నారు. కేసీఆర్ పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. వచ్చే ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయ.. కాంగ్రెస్ విజయం తథ్యం.. కేసీఆర్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని అన్నారు.