జాతీయ వార్తలు

సీజేయే సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ధర్మాసనాలు ఏర్పాటు, కేసులు కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి సర్వహక్కులూ ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘సమానుల్లో ప్రథములు’అంటూ విస్పష్టంగా తెలిపింది. కేసులు కేటాయింపు, పారదర్శంగా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వీకర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారించి ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులు కేటాయింపు, ధర్మాసనాలు ఏర్పాటు చేసే విషయంలో ప్రధాన న్యాయమూర్తికే సర్వ హక్కులూ ఉన్నాయని జస్టిస్ చంద్రచూడ్ లిఖితపూర్వకంగా తీర్పును వెలువరించారు. పిటిషన్ సీజేఐకు అప్రదిష్టతెచ్చేదిగా భావించిన బెంచ్ దాన్ని కొట్టివేసింది. జనవరి 12న సుప్రీం న్యాయమూర్తులు చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకూర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీజేఐపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అశోక్ పాండే అనే వ్యక్తి పిల్ వేశారు.