జాతీయ వార్తలు

షాజహాన్ రాసిచ్చిన పత్రాలు తెండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: మొఘల్ చక్రవర్తి షాజహాన్ సంతకంతో కూడిన పత్రాలను చూపించాలని సుప్రీంకోర్టు సున్నీ వక్ఫ్‌బోర్డును ఆదేశించింది. తాజ్‌మహల్ తమదేనని, 1631లో షాజహాన్ ‘వక్ఫ్‌నామా’ ద్వారా తమకు దాన్ని ఆధీనం చేశాడని, సున్నీ వక్ఫ్‌బోర్డు వాదిస్తోంది. ఈ నేపథ్యంలో షాజహాన్ సంతకంతో కూడిన ఆ డాక్యుమెంట్లను చూపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం కోరింది. ఎవరైనా తన ఆస్తిని వక్ఫ్‌కు దానం చేయాలన్న ఉద్దేశం ఉంటే దాన్ని వక్ఫ్‌నామా ద్వారా ఆ పని చేయవచ్చు. ‘తాజ్‌మహల్ వక్ఫ్‌బోర్డుకు చెందిందని ఎవరు నమ్ముతారు’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇటువంటి సమస్యలతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని పేర్కొంది. ఈ చారిత్రక కట్టడం స్వామిత్వంపై 2010లో పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్‌బోర్డు తాజ్‌మహల్ తమ ఆస్తి అంటూ వాదిస్తున్న నేపథ్యంలో పురావస్తు శాఖ కోర్టును ఆశ్రయించింది. మొఘల్ పాలకుల తర్వాత, వారు నిర్మించిన కట్టడాలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారని, స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి ఈ చారిత్రక కట్టడాన్ని భారత ప్రభుత్వ ఆధీనంలోని ఏఎస్‌ఐ నిర్వహిస్తోందని ఆ సంస్థ తరపు న్యాయవాది వాదించారు. అసలు వక్ఫ్‌నామా లేదని ఆయన పేర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత ధర్మాసనం కేసును ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.