జాతీయ వార్తలు

రామమందిర నిర్మాణానికి అనుకూలంగానే సుప్రీం తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 14: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగానే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ఉంటుందని, హిందువులంతా ఇదే నమ్మకంతో ఉన్నారని విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చాంపట్ రాజ్ బుధవారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈ విషయంలో దేశంలో అన్నివర్గాల ప్రజలు హిందువుల సెంటిమెంటును అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. సుమారు ఐదు వందల సంవత్సరాల నుంచి అయోధ్యలో రామమందిరం వివాదం కొనసాగుతోందని, ఇక సుదీర్ఘ నిరీక్షణ ఎంతమాత్రం భరించలేనిదిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం సైతం అర్థం చేసుకుని హిందువులకు అనుకూలంగా తీర్పునిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశలోనే ఈనెల 25న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యలో ‘్ధర్మసభ’ను నిర్వహించనున్నామని, సుమారు లక్షమంది ఈ సభకు హాజరవుతారని ఆయన తెలిపారు. అలాగే తదుపరి న్యూఢిల్లీలో సైతం ఇలాంటి సభనే ఐదు లక్షల మందితో నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. హిందువుల సెంటిమెంటును ప్రభుత్వానికి, న్యాయస్థానానికి తెలియజేసేందుకే ఈ ధర్మసభలను నిర్వహించ తలపెట్టామని రాజ్ వెల్లడించారు. కాగా రామమందిర నిర్మాణానికి అవసరమైన రాళ్లను చెక్కేపని దాదాపుగా పూర్తయిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.