జాతీయ వార్తలు

బందిపోట్ల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరేలీ (యూపీ), నవంబర్ 14: ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాల్లో ఒక ఇంటిని దోపీడీ చేసేందుకు వెళ్లిన దుండగులు తమకు అడ్డు వచ్చిన ఇంటి యజమానిని కాల్చి చంపారు. యజమాని తమ్ముడిని చితకబాదారు. ఈ ఘటన బరేలీ జిల్లా బామూరా ప్రాంతంలోని బైమాన్యా గ్రామంలో జరిగింది. దుండగులు రాకతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గట్టిగా అరిచారు. దీంతో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చామన్ అనే వ్యక్తి మరణించాడు. అతని తమ్ముడు నసీముద్దీన్‌పై దౌర్జన్యం చేశారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు పరుగెత్తుకు వచ్చారు. పారిపోతున్న దుండగుల్లో ఇద్దరిని పట్టుకున్నారు. వీరు నవీద్, అచాన్‌గా గుర్తించారు. పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఈ ఇద్దరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.