జాతీయ వార్తలు

అయోధ్యలోనే కాదు అన్నిచోట్లా... ముస్లింలు సురక్షితమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 14: ఒక్క అయోధ్యలోనే కాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్నిచోట్లా ముస్లింలంతా సురక్షితంగా జీవిస్తున్నారని యూపీ డీజీపీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. యూపీలో బాబ్రీ మసీదు-రామమందిర నిర్మాణం వివాదం నేపథ్యంలో ముస్లింలు అయోధ్యలో అభద్రతా భావంతో జీవిస్తున్నారని ముస్లిం నేత ఇక్బాల్ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ యూపీ రాష్ట్రంలోని ముస్లింలందరూ సురక్షితంగా, ధీమాగా జీవిస్తున్నారని, గత సంవత్సరంన్నరగా రాష్ట్రంలో ఎలాంటి మత ఘర్షణలు జరగకపోవడమే దీనికి నిదర్శనమని ఆయన విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఎక్కడైనా మతపరమైన ఉద్రిక్తత ఏర్పడినా తాము సమయానికి స్పందిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. తాను అన్సారీ విడుదల చేసిన వీడియోను చూడలేదని, కొందరు ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారో అర్థం కావడం లేదని, ఏమైనా ఇబ్బంది ఉంటే ఆయన నేరుగా తనతో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
ఆయనకు వెంటనే రక్షణ కల్పించాలని తాను స్థానిక పోలీసులను ఆదేశించినట్టు డీఐజీ తెలిపారు. రాష్ట్రంలోని 23 కోట్ల ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమ శాఖపై ఉందని, దానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని అన్నారు.