జాతీయ వార్తలు

యువశక్తే మన సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: నిజమైన విద్య శీలము, సామర్థ్యం, ప్రమాణము, ప్రవర్తనను పెంచేదిగా ఉండాలని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్బోధించారు. వెంకయ్య నాయుడు బుధవారం నోయిడాలోని బిర్లా ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ సంస్థ స్నాతకోత్సవంలో ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. యువ మానవ వనరులే మన దేశానికి అత్యంత ముఖ్యమైన సంపద అని ఆయన ఉద్ఘాటించారు. మన యువశక్తి యుక్తులను సమర్థవంతంగా ఉపయోగించుకునే స్థాయికి దేశం ఎదగాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. యువశక్తిని సద్వినియోగం చేసుకునేందుకు నైపుణ్య శిక్షణ కల్పించాలని సూచించారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగం, ఇతర సర్వీసుల అవసరాలకోసం యువశక్తిని ఉపయోగించుకోవాలని ఆయన ఉద్బోధించారు. యువత ఆయా రంగాల్లో నైపుణ్యాన్ని సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. భావి తరాలకు ఉపయోగపడే విద్యార్థులను తయారు చేసేందుకు విశ్వవిద్యాలయాలు తమ బోధనా పద్ధతులు, సిలబస్‌ను మార్చుకోవాలని హితవు చెప్పారు. విశ్వవిద్యాలయాలు అధునాతన బోధనా పద్ధతులను అవలంబించినప్పుడే 21 శతాబ్దం సవాళ్లను ఎదుర్కొనగలిగే శక్తి విద్యార్థులకు కలుగుతుందన్నారు. ప్రతి స్థాయిలో విద్యా సంబంధ వౌలిక సదుపాయాలు విస్తరించవలసిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. విద్యా సంబంధ వౌలిక సదుపాయాలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆయన తెలిపారు. బింటెక్ లాంటి మేనేజ్‌మెంట్ సంస్థల్లో పరిశోధనా పత్రాలపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉన్నదని వెంకయ్య సూచించారు. నైపుణ్యాభివృద్ధి ఎంతో ముఖ్యమని చెబుతూ కేంద్ర ప్రభుత్వం నాస్కాం వంటి సంస్థల సహాయంతో నైపుణ్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ఉత్పాదక, సేవారంగంలో భారతదేశం మొదటి పది స్థానాల్లో ఉండాలంటే నైపుణ్యాభివృద్ధి ఎంతో ముఖ్యమని అన్నారు. నైపుణ్యం గల యువత అవకాశాలకోసం ప్రయత్నించటంతోపాటు స్వంత వ్యాపారాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించాలని ఉప రాష్టప్రతి సూచించారు. మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఉపాధికోసం చూసేవారు కాకుండా ఉపాధి సృష్టికర్తలు కావాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తదితర కార్యక్రమాలు యువతలో మేనేజ్‌మెంట్ నైపుణ్యాన్ని పెంచుతున్నాయని ఆయన చెప్పారు.