జాతీయ వార్తలు

ప్రజా విశ్వాసాన్ని చూరగొనండి... ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశంలో పరిపాలన వ్యవస్థలు, పరిపాలన తీరు పట్ల ప్రజల్లో నిరాశ అలుముకుందని మాజీ రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ఈ వ్యవస్థలు జాతి గర్వించదగిన విధంగా ఉండాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. శుక్రవారం ఇక్కడ శాంతి, సామరస్యత, సంతోషం , మార్పు అంశాలపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రణబ్ ముఖర్జీ ఫౌండేషన్ సెంటర్ ఫర్ రీసెర్చి ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ (సీఆర్‌ఆర్‌ఐడీ) ఏర్పాటు చేసింది. ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగంలో నిర్దేశించినట్లుగా పరిపాలనా వ్యవస్థలను నడపాలన్నారు. ప్రజల విశ్వసనీయతను చూరగొనేందుకు వీలుగా లోటుపాట్లను సరిదిద్దుకోవాలన్నారు. ఈ దిద్దుబాటుకు ఈ వ్యవస్థలే శ్రీకారం చుట్టాలన్నారు. రాజ్యాంగ పరిధిలోని వివిధ వ్యవస్థల మధ్య సున్నితమైన విభజన రేఖ ఉంటుందన్నారు. సమతౌల్యతతో బాధ్యులు నడుచుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతంగా నడుస్తోందన్నారు. మన దేశంలో ఎన్నికల సంఘం, కాగ్, స్వతంత్ర న్యాయ వ్యవస్థ చురుకుగా బలంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులన్నారు. పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలిగించరాదన్నారు. ఎవరి పరిధిలో వారు రాజ్యాంగ ఆదేశాలకు లోబడి విధులను నిర్వహించాలన్నారు. భారత్ ఘనమైన నాగరికత, చరిత్రను కలిగి ఉందన్నారు. రాజ్యాంగ విధులను నైతికవిలువలతో నిర్వహించాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు వీలుగా రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలన్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలను చూస్తే వ్యవస్థలు ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు మరింత కృషి చేయాలని ఆయన కోరారు. ఇటీవల కాలంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్న తీరుతో ప్రజలు విసుగు చెందారని, నిరాశకు లోనవుతున్నారన్నారు. ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా ఈ వ్యవస్థలు ప్రజాస్వామ్యం పరిరక్షణకు నడుంబిగించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య చోటు చేసుకున్న వివాదాలపై మాజీ రాష్టప్రతి పై వ్యాఖ్యలు చేసి ఉంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీకన్నారు. వసుధైక కుటుంబం అంటే భారత్ ప్రపంచానికి గుర్తుకువస్తుందన్నారు. ప్రభుత్వంపై ఆధారపడి జీవించే వారు కోట్లాది మంది ఉన్నారు. వారికి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. దేశంలో సంఘర్షణలను నివారించాలన్నారు. దీనికి సామరస్యత, శాంతి ముఖ్యమన్నారు.