జాతీయ వార్తలు

రాజస్థాన్‌లో సం‘కుల’ సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 23: రాజస్థాన్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా కులం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అధికార బీజేపీ లేదా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సామాజిక సమీకరణలే కీలకం. ఓ కులం అభ్యర్థిని పార్టీ నిలబెడితే అదే సామాజిక వర్గం వ్యక్తిని పక్కపార్టీ బరిలో దించుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే 31 చోట్ల ఈ తరహా పోటీ నెలకొంది. ఒకే కులానికి చెందిన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 33 మంది జాట్ కులానికి చెందిన అభ్యర్థులను రంగంలో దించింది. రాజస్థాన్ అసెంబ్లీకి డిసెంబర్ 7న పోలింగ్ జరుగుతోంది. బీజేపీ 26 మంది రాజ్‌పుట్స్‌కు టిక్కెట్లు ఇస్తే, కాంగ్రెస్ 15 మందిని నిలబెట్టింది. ఎస్సీ,ఎస్టీలు 60 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే బ్రాహ్మణులు, వైశ్యులు, ఓబీలు, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యతే ఇచ్చింది. 15 మంది ముస్లిం అభ్యర్థులకు కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వగా, బీజేపీ మాత్రం ఒక్క ముస్లిం అభ్యర్థినే నిలబెట్టింది. 31 స్థానాల్లో ఒకే కులం అభ్యర్థులను బీజేపీ, కాంగ్రెస్ రంగంలో దించాయి. అందులో 15 చోట్ల ముఖాముఖి పోటీ జరుగుతోంది.
వారు కూడా జాట్ సామాజిక వర్గం అభ్యర్థులే కావడం విశేషం. ఏడు స్థానాల్లో బ్రాహ్మణ అభ్యర్థులు ముఖాముఖి తలపడుతున్నారు. రాజ్‌పుట్స్ నాలుగు చోట్ల ముఖాముఖి పోటీ పడుతున్నారు. గుర్జార్లు, యాదవులు రెండేసి నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా తలపడుతున్నారు. రాజస్థాన్‌లో టిక్కెట్లు కేటాయింపుదగ్గర నుంచి కులాలనే పరిగణనలోకి తీసుకుంటారని పరిశీలకులు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి రాజపుట్స్ మద్దతుపైనే బీజేపీ నడుస్తోంది. ఈసారి మాత్రం కమలనాథులు టిక్కెట్ల కేటాయింపులో పాత పద్ధతులను కాస్త సడలించారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకు కలిసొస్తాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 46.05 కాగా, కాంగ్రెస్‌కు 33.7 శాతం పోలయ్యాయి. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 34.27, కాంగ్రెస్ ఓట్ల శాతం 36.82. రాజ్‌పుట్స్ ప్రముఖ నాయకులు రామ్‌ప్రతాప్ కస్నియాపై హనుమాన్ మీల్ తలపడుతున్నారు. సూరత్‌గఢ్ నుంచి వారు బరిలో ఉన్నారు. అలాగే రామ్‌ప్రతాప్(బీజేపీ), వినోద్ చౌదరి(కాంగ్రెస్) హనుమాన్‌గఢ్ నుంచి తలపడుతున్నారు.
రామ్‌సింగ్ కస్వాన్(బీజేపీ), కృష్ట పూనియా(కాంగ్రెస్) సదుల్‌పూర్ నుంచి బరిలో ఉన్నారు. బ్రాహ్మణ అభ్యర్థుల విషయానికొస్తే గోపాల్ జోషీ(బీజేపీ), బీడీ కల్లా(కాంగ్రెస్) బికనేర్ పశ్చిమ నియోజకవర్గంలో నిలబడ్డారు. అభినేష్ మెహ్రీషీ(బీజేపీ), భన్వర్‌లాల్ (కాంగ్రెస్) రతన్‌గఢ్ నుంచి బరిలో ఉన్నారు.