జాతీయ వార్తలు

కుదిపేస్తున్న ‘గ్యాంగ్ రేప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/ముంబయి, ఏప్రిల్ 12: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ ఘటన ఘటన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగార్‌పై ఎట్టకేలకు ఎఫ్‌ఐఆర్ నమోదయింది. 16 ఏళ్ల బాలికపై జరిగిన ఈ దారుణానికి సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేను తక్షణం అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లక్నో వీధుల్లో గురువారం పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మరోపక్క రేపిస్టులకు కఠినంగా శిక్షించాలంటూ బాలివుడ్ పరిశ్రమ పెద్దఎత్తున డిమాండ్ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగార్ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నిరాకరించిన నేపథ్యంలో అతడికిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తీవ్రమైన విమర్శలు వస్తున్న దృష్ట్యా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదుకావడం గమనార్హం. ఇప్పటికే ఈ కేసు విచారణకు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఉన్నావ్ రేప్ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే అనుచరులు, బాధితురాలి బంధువుల మధ్య వివాదం తలెత్తగా బాధితురాలి తండ్రిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అతడు పోలీసుల కస్టడీలోనే చనిపోవడంతో కేసు కొత్త మలుపుతిరిగింది. అధికార బీజేపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే కస్టడీలో మరణం చోటుచేసుకుందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ‘ఉన్నావ్ ఘటనపై రాష్ట్ర పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అరెస్టుపై నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ దర్యాప్తు సీబీఐనే’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (హోం) అరవింద్ కుమార్ వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్న కుమార్ రాష్ట్ర హోం శాఖ సీబీఐకు లేఖ అందజేసిందని తెలిపారు. చిన్నారులపై లైంగిక దాడుల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కుల్‌దీప్ సెంగార్‌పై మఖీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. 376 (రేప్), 366 (కిడ్నాప్, అక్రమ నిర్బంధం), 363 (కిడ్నాప్), 506 (బెదిరింపులు) సెక్షన్లు పెట్టారు. ఈ కేసు నమోదయిన తక్షణమే నిందితుణ్ని అరెస్టు చేయడానికి వీలుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ (ఇన్ఫర్మేషన్) అవినాష్ అవస్థి బుధవారం రాత్రి ఓ ప్రకటన చేస్తూ కేసును సీబీఐకి అప్పగిస్తామని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను కాపడుతున్నామన్న ఆరోపణలను ఆయన ఖం డించారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి పూర్తి భద్రత కల్పిస్తున్నట్టు డీజీపీ ఓపీ సింగ్ వెల్లడించారు.