జాతీయ వార్తలు

ఉద్దేశపూర్వకంగానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కాంగ్రెస్ దురుద్దేశ్యపూర్వకంగా స్తంభింపజేసిందని ఆరోపిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప లువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు గురువారం నిరసన నిరాహార దీక్షలు చేశారు. నరేంద్ర మోదీ తన విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఒక రోజంతా నిరాహార దీక్ష కొనసాగించారు. ఆయన ఉపవాసం చేస్తూనే చెన్నైలో ఏర్పాటు చేసిన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన, క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం తదితర కా ర్యక్రమాలకు హాజరయ్యారు. ప్రస్తుతం కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హుబ్లీ పట్టణంలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేశారు. కేంద్ర మంత్రులు సురేశ్‌ప్రభు, విజయ్‌గోయల్, ఉమాభారతి, స్మృతి ఇ రానీ తదితరులు దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో నిరాహార దీక్ష చేశారు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేష్ శర్మ ఢిల్లీ శివార్లలోని నోయిడాలో నిరాహార దీక్ష చేశారు. మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ జార్ఖండ్‌లోని రాం చీలో నిరాహార దీక్ష చేస్తే ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వారణాసిలో నిరాహార దీక్ష చేశారు. వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో తమ నాయకులు నిరాహార దీక్ష నిర్వహించారని బీజేపీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ దురుద్దేశ్యంతో పార్లమెం టు బడ్జెట్ సమావేశాలను స్తంభింపజేసినందుకు నిరసనగా ఒక రోజు ఉపవాసం చేస్తున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శం కర్ ప్రసాద్ విలేఖరులతో చెప్పారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు బిల్లులపై పార్లమెంటులో చర్చించాలనుకున్నాము, అయితే కాంగ్రెస్ దురుద్దేశ్యంతో బడ్జెట్ సమావేశాలను దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. వ్యవసాయ రంగం, రైతులు, కా ర్మికుల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన బిల్లులు, బ్యాం కులను మోసం చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు సంబంధించిన బిల్లులపై చర్చ జరిపి పార్లమెంటు ఆమోదం తీసుకోవాలనుకున్నామని, అదేవిధంగా ట్రిపుల్ తలాక్‌పై కూడా చర్చ జరపాలనుకున్నామన్నారు. కానీ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బడ్జెట్ సమావేశాలను కొనసాగనివ్వలేదని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపేందుకూ తాము సంసిద్ధత వ్యక్తం చేసినా సభను గందరగోళంలో పడవేశాయని ప లువురు మంత్రులు ఆరోపించారు. పార్లమెంటు ఉభయ సభలను సజావుగా నడిపించేందుకు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కాం గ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ముందుకు సాగకుండా అడ్డంకులు సృ ష్టించాయని, అందుకు నిరసనగానే ఒకరోజు ఉపవాసం చేస్తున్నామని వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో జరిగిన కుంభకోణాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే బడ్జెట్ సమావేశాలను దెబ్బ తీశాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్‌గోయల్ దుయ్యబట్టారు. పార్లమెంటు ఉభయ సభలు నెల రోజుల పాటు స్తంభించిపోవటానికి కాంగ్రెస్ కారణమని ఆయన ఆరోపించారు.