జాతీయ వార్తలు

ఏడు రోజుల కస్టడీకి కుల్‌దీప్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 14: దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి సృష్టిస్తున్న ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగార్‌ను ఏడురోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ లక్నో కోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఇంతకుముందు కోర్టుకు హాజరయ్యేముందు మాట్లాడిన కుల్‌దీప్‌సింగ్ తనకు న్యాయవ్యవస్థ పట్ల పూర్తి నమ్మకం ఉందని అన్నారు. 17గంటల పాటు జరిగిన ఇంటరాగేషన్ అనంతరం శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అదుపులోకి తీసుకున్న కుల్‌దీప్‌సింగ్‌ను నేడు కోర్టుకు హాజరుపరిచారు. ఇటు ప్రధాని మోదీ, అటు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఉన్నావో గ్యాంగ్‌రేప్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించ డం, దోషులను వదిలే ప్రసక్తి లేదని ఉద్ఘాటించడంతో కుల్‌దీప్‌సింగ్ ఇంటరాగేషన్, అరెస్టు చకచకా జరిగిపోయాయి.