జాతీయ వార్తలు

విక్రమాదిత్యకు ‘తేజస్సు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: యుద్ధ విమానవాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై స్వదేశీ యుద్ధ విమానం తేజస్ (లైట్ కాంబాట్ ఏయిర్ క్రాఫ్ట్) ను ఒడిసిపట్టి దించటం (అరెస్టెడ్ లాండింగ్)లో డిఆర్‌డిఓ శాస్తవ్రేత్తలు విజయం సాధించారు. అమెరికా, బ్రిటన్, రష్యా తదితర అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు భారత దేశం కూడా సాధించింది. కమడోర్ జయ్‌దీప్ మవొలంకర్ శనివారం ఉదయం పది గంటలకు తేజస్ విమానాన్ని యుద్ధ విమాన వాహక నౌక విక్రమాదిత్యపై విజయవంతంగా దించి చరిత్ర సృష్టించారు. తేజస్‌ను విక్రమాదిత్యపై ఒడిసిపట్టి దించే ప్రక్రియలో క్యాప్టన్ దహియా లాండింగ్ సేఫ్టీ ఆధికారిగా పని చేయగా కమడోర్ వివేక్ పాండ్య యుద్ధ విమాన వాహక నౌకపై టెస్ట్ డైరక్టర్‌గా వ్యవహరిస్తే గ్రూప్ క్యాప్టన్ కబడ్వాల్, కమడోర్ అంకుర్ జైన్ పర్యవేక్షలుగా పని చేశారు. తేజస్ యుద్ధ విమానం యుద్ధవిమాన వాహక నౌకపై దిగగానే దానిని ప్రత్యేకంగా రూపొందించిన ఇనుప చైన్లతో పట్టి నిలపటం అనేది అత్యంత ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో కూడిన ప్రక్రియ. డిఆర్‌డిఓ చైర్మన్, రక్షణ శాఖ ఆర్ అండ్ డి కార్యదర్వి డాక్టర్ సతీష్ రెడ్డి డిఆర్‌డిఓ, నౌకాదళం, ఏడిఆర్, హెచ్‌ఏఎల్, సిఎస్‌ఐఆర్ తదితర సంస్థల శాస్తవ్రేత్తలను అభినందించారు.