జాతీయ వార్తలు

స్నేహం కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: తన తాజా విదేశీ పర్యటన ద్వారా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలకు మరింత బలాన్ని అందించగలదన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. సోమవారం ఐదు రోజుల పర్యటనను చేపట్టడానికి ముందు మాట్లాడిన మోదీ, స్వీడన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లతో, అలాగే కామనె్వల్త్ ప్రభుత్వాధినేతలతోనూ తాను జరపబోయే చర్చలు, వీటితో భారత్ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, స్వచ్ఛ ఇంధనం సహా స్వీడన్, యుకేలతో ద్వైపాక్షికంగా భారత్‌ను మరింత సన్నిహితం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ పర్యటన తొలిదశలో భాగంగా స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లాఫ్‌వెన్‌తో చర్చలు జరుపుతారు. అలాగే భారత- నార్డిక్ శిఖరాగ్ర సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. భారత్-స్వీడన్‌ల మధ్య సామరస్యపూర్వక సుహృద్భావ మైత్రీబంధం ఉందని, ప్రజాస్వామ్య విలువలు, నియమాల ఆధారిత స్వేచ్ఛాయుత విధానాలకే ఈ దేశాలు కట్టుబడి ఉన్నాయని మోదీ తెలిపారు. ముఖ్యంగా భారత్ చేపట్టే అభివృద్ధి కార్యకలాపాల అన్నింటిలోనూ స్వీడన్ క్రియాశీలక భూమిక పోషిస్తోందని పర్యటనకు ముందు జారీ చేసిన ప్రకటనలో మోదీ తెలిపారు. మంగళవారం స్వీడన్ ప్రధానితో జరిపే చర్చల్లో ద్వైపాక్షిక అంశాలతోపాటు శాస్త్ర సాంకేతిక రంగం, స్మార్ట్ సిటీలు, వ్యాపార వాణిజ్య సహకారంపై కూడా విస్తృతంగా మంతనాలు జరిగే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. తన పర్యటన సందర్భంగా స్వీడన్ రాజు కార్ల్ గుస్త్ఫాను కూడా తాను కలుసుకుంటానని తెలిపారు. భారత్ -స్వీడన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న నార్డిక్ సదస్సులో ఫిన్‌లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్ దేశాల ప్రధానులు పాల్గొంటున్నారు. స్వీడన్ పర్యటన అనంతరం యునైటెడ్ కింగ్‌డమ్‌కు మోదీ వెళ్తారు. అక్కడ కామనె్వల్త్ దేశాల సదస్సులో పాల్గొనడంతోపాటు బ్రిటన్ ప్రధాని థెరిస్సా మేతోనూ చర్చలు జరుపుతారు. భారత్-బ్రిటన్‌ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్వైపాక్షిక అనుబంధానికి తన పర్యటన మరింత శక్తినివ్వగలదన్న ధీమాను మోదీ వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్, డిజిటల్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య సహకారం పెంపొందేలా ఈ పర్యటన సందర్భంగా చర్యలు తీసుకుంటామని మోదీ తెలిపారు. బ్రిటీష్ రాణిని కూడా కలుసుకోనున్న మోదీ, రెండు దేశాల సీఈవోలతోనూ సమావేశమై సరికొత్త ఆర్థిక భాగస్వామ్య ప్రణాళికను ఆవిష్కరిస్తారు. అలాగే, లండన్‌లో ఆయుర్వేద కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు.