జాతీయ వార్తలు

ప్రతిపక్షాలు ఐక్యంగా సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో అణిచి వేతకు తెర లేపింది, ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టటంతో పాటు కులం, మతం ఆధారంగా విభజిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వం దురాలోచనలను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షం కలిసికట్టుగా పని చేయాలని సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. సోనియా గాంధీ దేశంలో నెలకొన్న ప్రస్తుత పర్థితులపై సోమవారం ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ, బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, ఆం ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తో పాటు మహారాష్టల్రో కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన కూడా ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరుకాలేదు. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినాయకుడు శరద్ పవార్, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఇతర నాయకులు అహమద్ పటేల్, ఏకే ఆంటోని, కేసీ వేణుగోపాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేఎంఎం అధినాయకుడు, జార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆర్‌జేడీ నాయకుడు మనోజ్ ఝా, సీపీఐ నాయకుడు డి.రాజా, లోకతాంత్రిక్ జనతాదళ్ నాయకుడు శరద్ యాదవ్ తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ప్రతిపక్షాల నాయకులనుద్దేశించి మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఎన్నడూ లేనంత సంక్షోభం నెలకొన్నదంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని దెబ్బ తీస్తున్నారు, ప్రభుత్వాధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తున్న విద్యార్థులు, యువతపై విరుచుకుపడుతోందని ఆమె దుయ్యమట్టారు. దేశంలోని పలు ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లోని ఎంతో మందిని వేధింపులు, దాడులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా యువకులు తమంత తాము ముందుకు వచ్చి ఉద్యమం చేస్తున్నారని ఆమె చెప్పారు. సిఏఏకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి దేశంలోని అన్ని వర్గాల వారు మద్దతు ఇస్తున్నారని సోనియా చెప్పారు. దేశ ప్రజలు సీఏఏతో పాటు ఇతర కారణాల మూలంగా కూడా ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, ప్రజా ఉద్యమాల్లో ఇది బయటపడుతోందని ఆమె చెప్పారు. ఉద్యమిస్తున్న ప్రజల పట్ల ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ పోలీసులు స్పందించిన తీరు అత్యంత అమానుషంగా ఉనదని ఆమె విమర్శించారు. ఉద్యమిస్తున్న ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై పోలీసులు తమ ప్రకటనలను తామే ఖండించుకోవడం గమనార్హమని సోనియా గాంధీ చెప్పారు. జేఎన్‌యూ విద్యార్థులపై బీజేపీ మద్ధతుతో కొనసాగిన దాడి పట్ల దేశం యావత్ భయంతో వణికి పోయిందని ఆమె తెలిపారు. జామిలా మిలియా ఇస్లామియా, బెనారస్ హిందు విశ్వవిద్యాలయం తదితర ఉన్నత విద్యా సంస్థల్లో కూడా పోలీసులు విద్యార్థులు, యువత పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారని సోనియా గాంధీ ఆరోపించారు. అస్సాంలో నిర్వహించిన ఎన్‌ఆర్‌సీ ఘోరంగా విఫలమైంది అయినా మోదీ, అమిత్ షా ప్రభుత్వం జాతీయ పౌరుల చిట్టా ఏర్పాటుపై దృష్టి సారిస్తోందని ఆమె దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా జాతీయ పౌరసత్వ రిజిష్టరును తయారు చేసే లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వం జాతీయ పౌరుల చిట్టాను తయారు చేయాలనుకుంటోందని ఆమె ఆరోపించారు. ఆర్థిక కార్యకలాపాలు స్థంభించిపోవడం, దేశ ప్రగతి నత్తనడక నడవడం, ఆర్థిక మాంద్యం వంటి దేశం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల పరిష్కారంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. ఆర్థికాభివృద్ది కుంటుపడడం వలన దేశంలోని కోట్లాది మంది బడుగు, బలహీన వర్గాల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల గురించి ఈ ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించడం లేదు, వాటి పరిష్కారానికి కృషి చేయటం లేదని సోనియా గాంధీ విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారినికి మోదీ, అమిత్ షాల వద్ద ఎలాంటి సమాధానాలు లేవు అందుకే వారు దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రజలను మతం ఆధారంగా విభజించే సీఏఏ వంటి అంశాలను ముందుకు తెస్తున్నారని సోనియా ఆరోపించారు. ప్రభుత్వం దురాలోచనలను అడ్డుకునేందుకు కలిసి కట్టుగా పని చేయవలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని సోనియా గాంధీ సూచించారు.
'చిత్రం...ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశానికి హాజరైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ, గులాం నబీ అజాద్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తదితరులు