జాతీయ వార్తలు

సీఏఏ వ్యతిరేక ఉద్యమాలు ఓ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయా, జనవరి 14: దేశ వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమాల వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఇక్కడ ఆరోపించారు. ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే ఇవన్నీ పట్టుకొచ్చాయని ఆయన ధ్వజమెత్తారు. దేశం ఐక్యంగా ఉండడం చూడలేక ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాయని యోగి విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతుగా బీజేపీ ఏర్పాటు చేసిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ‘సీఏఏను వద్దంటున్న వారందరూ జాతీయ ప్రయోజనాలను వ్యతిరేకిస్తున్నట్టే’అని ఆయన విరుచుకుపడ్డారు. మత ప్రాతిపదికగా అణచివేతకు గురవుతున్న శరణార్ధులకు పౌరసత్వం కల్పించాలన్న మంచి సంకల్పంతోనే సీఏఏను తీసుకొచ్చినట్టు ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ స్పష్టం చేశారు. సీఏఏ ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని వారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రశంసించకుండా విమర్శలు చేయడం దుర్మార్గమని యోగి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధికోసం ఉద్యమాలు సృష్టించి వాటిని మండిస్తున్నాయని యూపీ సీఎం విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎవరి పట్లా ఎలాంటి వివక్ష లేకుండా సాగుతోందని ఆయన ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన వంటి సంక్షేమ పథకాలు ఎందరికో ప్రయోజనం చేకూర్చాయని ఆదిత్యనాథ్ వెల్లడించారు. సంక్షేమ పథకాలు మతం, కులం ప్రాతిపదికగా అందించినట్టు ఎవరైనా చెప్పగలరా?అని యోగి నిలదీశారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ నిర్మాణ కోసం మోదీ అహర్నిశలు పాటుపడుతున్నారని ఆయన చెప్పారు. నవ భారతం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంటే విపక్షం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) తమ చేతుల్లోంచి పోతుందన్న భయం పాకిస్తాన్‌కు పట్టుకుందని యూపీ సీఎం అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ తప్పుడు నిర్ణయం వల్లే ఇంత కాలం కాశ్మీర్ మండిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
'చిత్రం... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్