జాతీయ వార్తలు

ఎంపీల పింఛన్లపై పిల్ కొట్టివేసిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: మాజీ పార్లమెంటేరియన్లకు పింఛను, రవాణా భత్యాలు, పెర్క్‌ల చెల్లింపులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన ధర్మాసనం ‘ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నామని’ స్పష్టం చేసింది. అయితే ఈ పిల్‌పై తీర్పును గత మార్చి 7న కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ పిల్‌పై కేంద్ర ప్రభుత్వం తన వాదనను వినిపిస్తూ, మాజీ పార్లమెంట్ సభ్యులకు పింఛను ఇతర భత్యాల చెల్లింపు న్యాయసమ్మతమేనని పేర్కొంది. పదవినుంచి తప్పుకున్న తర్వాత కూడా వారి గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉండేందుకే ఈ చెల్లింపులు జరుపుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. 2018 కేంద్ర ఫైనాన్స్ బిల్లుపై కేంద్రం బెంచ్‌కు వివరించింది. ముఖ్యంగా 2023, ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఐదేళ్లకోమారు ద్రవ్యోల్బణ సూచి ప్రకారం వారి జీత భత్యాల రివిజన్ గురించి కూడా బెంచ్ దృష్టికి తీసుకొచ్చింది.
కాగా ఎంపిల జీతభత్యాలను నిర్ణయించడానికి ఒక స్వతంత్ర యంత్రాంగం ఏర్పాటు చేయాలని కోర్టు కోరగా, అ అంశాన్ని ‘పరిశీస్తున్నాం’ అని కేంద్రం వెల్లడించింది. ఎంపిలు పదవినుంచి తొలగిపోయిన తర్వాత కూడా పింఛన్లు ఇతర అలవెన్స్‌లు చెల్లించడం రాజ్యాంగంలోని 14వ అధికరణ (సమానత్వపు హక్కు)కు భంగకరమని ‘లోక్ ప్రహరి’ అనే ఎన్‌జీవో అంతకుముందు దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.