జాతీయ వార్తలు

కరొనావైరస్ ఎవరికీ సోకలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: ఇప్పటి వరకు మొత్తం 12,828 మంది విమాన ప్రయాణికులకు నావెల్ కరొనావైరస్ పరీక్షలు నిర్వహించగా, దేశంలో ఏ ఒక్కరికి ఆ వైరస్ సోకలేదని తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. విమానాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారందరికి జనవరి 22వ తేదీ వరకు నావెల్ కరొనావైరస్ పరీక్షలు నిర్వహించినట్టు వివరించింది. నావెల్ కరొనావైరస్‌కు సంబంధించి మారుతున్న పరిస్థితులు, దానిని ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ సమీక్షిస్తున్నారు. ఒకవేళ ఎవరికయినా ఈ వైరస్ సోకితే వారిని ఇతర రోగుల నుంచి విడిగా ఉంచి, చికిత్స అందించడానికి ఆసుపత్రులను సిద్ధంగా ఉంచడం, పరిస్థితి విషమించిన వారికి వెంటిలేటర్ సదుపాయాన్ని కల్పించడం, వ్యాధి సోకిందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి లేబొరేటరీలను సిద్ధం చేయడం వంటి వాటిని సమీక్షించాలని ఆమె అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించారు. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రయాణికులకు నావెల్ కరొనావైరస్ సోకిందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి థర్మల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, సౌదీ అరేబియాలో పనిచేస్తున్న కేరళ నర్స్ ఒకరికి వైద్య పరీక్షల్లో నావెల్ కరొనావైరస్ సోకినట్టు తేలిందని మీడియాలో వార్తలు రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ విషయాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఆ నర్స్‌కు మెరుగయిన వైద్యం అందేలా చూడాలని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను కోరారు. విజయన్ ఈ మేరకు జైశంకర్‌కు ఒక లేఖ రాశారని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం తిరువనంతపురంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, కేరళకు చెందిన నర్స్‌లకు నావెల్ కరొనావైరస్ సోకినట్టు తమకు ఎలాంటి సమాచారం అందలేదని కేరళలోని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, చైనానుంచి భారత్‌కు వస్తున్న విమాన ప్రయాణికుల్లో ఎవరయినా అస్వస్థతకు గురయితే, వెంటనే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది. చైనాలో ఈ వైరస్ సోకడం వల్ల ఇప్పటికే 17 మంది మృతి చెందారు.
'చిత్రం... కేరళ సీఎం పినరయి విజయన్