జాతీయ వార్తలు

బోడోలతో శాంతి ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న బోడో సమస్య శాశ్వత పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని బోడో ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ఎన్‌డీఎఫ్‌బీ, ఎబీఎస్‌యూతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత అవసరం లేకుండా ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. 1972 నుంచి బోడో విద్యార్థుల సంఘం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని సాగిస్తూనే వచ్చింది. ఈ ఒప్పందంపై ఐక్య బోడో ప్రజా సంఘం కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో సంతకం చేసింది. అలాగే దీనిపై అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సొనోవాల్‌తో పాటు నాలుగు బోడో సంఘాలకు చెందిన అగ్ర నేతలు సంతకం చేశారు. ఈ ఒప్పందాన్ని చారిత్రకమైనదిగా హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు. అస్సాంలోని బోడో ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వారి భాష, సంస్కృతి పరిరక్షణకు ఈ ఒప్పందం దోహం చేస్తుందన్నారు.
ఇది ఓ నవోదయం: మోదీ
న్యూఢిల్లీ, జనవరి 27: కేంద్ర ప్రభుత్వం బోడో సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందం శాంతి సామరస్యం కలిసి పని చేసే స్పూర్తికి నమ్మశక్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అభివృద్ధిపరమైన అన్ని ప్రయోజనాలు ఇక నుంచి బోడో ప్రాంతానికి వర్తిస్తాయని, అలాగే ప్రత్యేకమైన వారి సంస్కృతి వికాసానికి కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుందని మోదీ తెలిపారు. బోడో ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ చేపడుతుందని మోదీ స్పష్టం చేశారు. గతంలో సాయుధ పోరాటం సాగించిన మిలిటెంట్ గ్రూపులన్నీ కూడా ఆయుధాలు విసర్జించి జాతీయ జన జీవన స్రవంతిలో కలిసాయని ఇక నుంచి దేశ అభివృద్ధి పథంలో భాగమై పని చేస్తాయని మోదీ తెలిపారు. ఈ చారిత్రక ఒప్పందం కుదిరిన అనంతరం ట్వీట్ చేసిన మోదీ దీనిని బోడో ప్రజలకు పరివర్తనాత్మక ఫలితానిస్తుందన్నారు. మొత్తం భారత దేశానికే ఇది ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్న మోదీ అన్ని కీలక భాగస్వామ్య పక్షాలను ఒకే ఛత్రం కిందకు ఈ ఒప్పందం తీసుకుని వచ్చిందన్నారు.
*చిత్రం... ఢిల్లీలో సోమవారం కుదిరిన చారిత్రక బోడో ఒప్పందం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి సొనోవాల్, బోడో ప్రతినిధులు