జాతీయ వార్తలు

దళితులకు చేరువయ్యేందుకు భాజపా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఎస్సీ/ఎస్టీలకు మరింత చేరువ కావడానికి భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ యత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ సదుపాయం కల్పించే యోచనలో ఉన్నది. ఈ మేరకు త్వరలోనే ఆర్డినెన్స్‌ను జారీచేసే అవకాశం ఉంది. ఈ వర్గాలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనను సుప్రీంకోర్టు ఆమోదించినా, అందుకు నిబంధనలు నిర్దేశించిన నేపథ్యంలో, తన తీర్పును పునఃపరిశీలించాలని కేంద్రం మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తుందని, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. ఆయనే ప్రస్తుతం భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏకు ఎస్సీ, ఎస్టీ వ్యవహారంలో అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఈ వర్గాల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రుల సంఘంలో రామ్‌విలాస్ పాశ్వాన్ సభ్యులుగా ఉన్నారు. ఇదిలావుండగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొని రావడానికి ప్రభుత్వానికి ఏవిధమైన అభ్యంతరం లేదు. కానీ దానికంటే ముందు, తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ/ఎస్టీ అత్యాచార చట్టం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందు కోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మక రూపం దాల్చడంతో, కేంద్రం పై నిర్ణయం తీసుకుంది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాము ఎస్సీ/ఎస్టీ వర్గాలకు అనుకూలమేనని తెలియజెబుతూ వారికి దగ్గరయ్యేందుకు ఉద్యోగాల్లో ప్రమోషన్ల కల్పనపై ముందడుగు వేస్తోంది. కాగా రామ్‌విలాస్ పాశ్వాన్ విలేకర్లతో మాట్లాడుతూ, ప్రమోషన్ ఇచ్చేముందు సదరు ఉద్యోగి వెనుకబాటును, సామర్థ్యాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టుకోరింది. అయితే సామర్థ్యం విషయంలో ఎస్సీ ఉద్యోగులు ఇత ర వర్గాలవారితో ఎంతమాత్రం తీసిపోరు అన్నారు.