జాతీయ వార్తలు

నగదు కొరత తాత్కాలికమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: వివిధ రాష్ట్రాల్లో తీవ్ర నగదు కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దేశంలో అవసరానికి మించిన నగదు చెలామణిలో ఉందని, ఎక్కడైనా నగదు కొరత ఉంటే అది తాత్కాలికమేనని ప్రకటించారు. మొదట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న నగదు కొరత పరిస్థితి ప్రస్తుతం మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, కర్నాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వ్యాపించింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోపోతే మరో నెల రోజుల్లో ఈ పరిస్థితి దేశంలోని అత్యధిక రాష్ట్రాలకు పాకుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అరుణ్ జైట్లీ మంగళవారం ఆర్థిక శాఖ సీనియర్ అధికారులతో సమావేశమై నగదు కొరత, నోట్ల లభ్యత, పంపిణీ తదితర పరిస్థితులను సమీక్షించారు. దేశంలో ఎక్కడైనా నగదు కొరత ఉంటే అది తాత్కాలికమేనని, ఈ కొరతను సరిదిద్దేందుకు ఆర్థిక శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన ట్వీట్ చేశారు. అవసరాని కంటే ఎక్కువ నగదు చెలామణిలో ఉండటంతోపాటు బ్యాంకుల వద్ద కూడా తగినంత నగదు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఐదు వందలు, రెండు వందలు, వంద రూపాయల నోట్లను తగిన మోతాదులో ఎప్పటికప్పడు చెలామణిలోకి తెస్తున్నామని, అవసరం మేరకు ఆయా నోట్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని ఆర్థిక శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం తెలిపింది. దేశ అవసరాలకు సరిపడా నగదు చెలామణిలో ఉందని, ముందు, ముందు నగదు అవసరాలు పెరిగితే, ఆ పెరుగుదల మేరకు నగదును చెలామణిలోకి తెచ్చేందుకు అవసరమైన నిల్వలు తమ వద్ద ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఏటీఎంలలో అవసరమైన మేరకు నగదు ఉండేలా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నగదు కొరత వలన మూలపడిన ఏటిఎంలను వాడుకలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రకటించింది. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరతకు దారితీసిన పరిస్థితుల గురించి రిజర్వు బ్యాంకు సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయని, పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దాదాపు రెండు నెలల క్రితం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని ఏటీఎంల నుండి రెండు వేల రూపాయల నోట్లు మాయం కావటం ప్రారంభమైంది. 2019లో జరిగే లోక్‌సభ, శాసన సభల ఎన్నికలకోసం వివిధ పార్టీల రాజకీయ నాయకులు రెండు వేల రూపాయల నోట్లను నిల్వచేయటం ప్రారంభించినందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతోందని అప్పట్లో ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లో నగదు కొరత ఏర్పడటంతో ఆర్థిక శాఖ అధికారులు ఆలోచనలో పడిపోయారని అంటున్నారు. రాజకీయ నాయకులతోపాటు బడా పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు రెండు వేల రూపాయల నోట్లను అక్రమంగా నిల్వ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో జరిగే లోక్‌సభ, వివిధ రాష్ట్రాల శాసన సభ ఎన్నికల కోసం పలు రాజకీయ పార్టీలు, నాయకులు పెద్ద నోట్లను నిల్వ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో మామూలు కంటే ఎక్కువ నగదును తీసుకోవటం వల్లే నగదు కొరత ఏర్పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కోసం పెద్ద నోట్ల నిల్వ జరుగుతోందా లేదా అనేది తేల్చాలని కేంద్ర ఆర్థిక శాఖ సిబిఐ తదితర దర్యాప్తు సంస్థలను ఆదేశించినట్లు చెబుతున్నారు.