జాతీయ వార్తలు

అక్రమార్కులకు దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: బ్యాంకులకు వేలాది కోట్లు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన రత్నాల వ్యాపారి నీరవ్ మోదీ లాంటి వారికి మంచి రోజులు తీసుకురావటం ద్వారా దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పెద్దఎత్తున ధ్వజమెత్తారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో నగదు కొరత నెలకొనటంపై రాహుల్ గాంధీ మంగళవారం ట్వీట్‌ల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు ఉగ్రవాదం మరోసారి దేశాన్ని పట్టిపీడిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీ తదితరులు బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు మోసగించటంపై నరేంద్ర మోదీ ఎందుకు వౌనం వహిస్తున్నారని ఆయన నిలదీశారు. నీరవ్ మోదీ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలతో దేశం విడిచిపోరిపోయిన కుంభకోణంపై నరేంద్ర మోదీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లడలేదని ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ మన జేబుల్లోని 500, 1000 రూపాయల నోట్లను అపహరించి నీరవ్ మోదీ జేబులో పెట్టటం వల్లనే మనమంతా ఈరోజు డబ్బు కోసం క్యూల్లో నిలబడవలసి వస్తోందని ఆయన దుయ్యబట్టారు. నరేంద్ర మోదీకి తానంటే భయం, అందుకే దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తనతో చర్చించేందుకు ప్రధాన మంత్రి భయపడుతున్నాడని రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంటులో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిపేందుకు నరేంద్ర మోదీ అంగీకరించటం లేదు, పార్లమెంటులో వివిధ అంశాలపై మాట్లాడేందుకు తనకు పదిహేను నిమిషాల సమయం కేటాయిస్తే నరేంద్ర మోదీ పారిపోయేలా చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించారు. తనను ఎదుర్కొనలేకపోతున్నాడు కాబట్టే మోదీ పార్లమెంటులో చర్చకు అంగీకరించటం లేదని ఆరోపించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, నీరవ్ మోదీ అంశంపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇస్తే నరేంద్ర మోదీ తనను తట్టుకోలేడని రాహుల్ గాంధీ చెప్పారు. నరేంద్ర మోదీకి నీరవ్‌మోదీ, మెహుల్ చోస్కీ వ్యక్తిగతంగా తెలుసు, అందుకే మోదీ వారిని నీరవ్ భాయ్, మెహుల్ భాయ్ అని సంభోదిస్తాడని రాహుల్ గాంధీ చెప్పారు. ఏటీఎంల నుండి నగదు ఎందుకు మాయమైపోతోందని ఆయన ప్రశ్నించారు. నోట్ల రద్దు వలన జరిగిన మోసాన్ని అర్ధం చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. నోట్ల రద్దు మూలంగా గతంలో ఎదురైన సమస్యలు ఇప్పుడు మరోసారి దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. నరేంద్ర మోదీ చేసిన మాల్యా, నీరవ్ మాయ మూలంగానే నగదు కొరత ఏర్పడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో సంతోషంగా గడుపుతుంటే దేశ ప్రజలు బ్యాంకుల్లో నగదు కోసం కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు.