జాతీయ వార్తలు

విభజన హామీలపై జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేలా, విభజన హామీలు అమలు చేసే విధంగా చూడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తక్షణం జోక్యం చేసుకోవాలని ఆ పార్టీ ఎంపీల బృందం మంగళవారం రాష్టప్రతి భవన్‌లో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను ఆందజేశారు. ఈ బృందం లో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. అనంతరం ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తమ పార్టీ ఐదుగురు లోకసభ సభ్యుల రాజీనామాకు దారితీసిన పరిస్థితులను రాష్టప్రతికి వివరించినట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేకహదా కోసం నాలుగేళ్లుగా తాము చేసిన పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షలను ఆయనకు వివరించినట్లు చెప్పారు. రాజ్యాంగపరంగా తాను ఏం చేయగలనో తప్పకుండా చర్యలు తీసుకుంటానని రాష్టప్రతి హామీ ఇచ్చినట్లు మేకపాటి వెల్లడించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు దేశంలో ప్రధాని మోదీ గ్రాఫ్ తగ్గిపోతోందని భావించిన చంద్రబాబు మళ్లీ బీజేపీతో ఎన్నికలకు వెళితే ఓడిపతోతామనే ఉద్దేశ్యంతో ఏన్డీయే నుంచి బయటకు వచ్చారని అన్నారు. తాము కేంద్రంతో లాలూచీ పడినట్లు టీడీపీ పనికట్టుకుని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, కేంద్రంతో కుమ్మక్కు అయితే బీజేపీపై పోరాటం ఎందుకు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈవిధంగా ప్రజల్ని టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన అన్నారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం తాము తమ పదవులకు రాజీనామా చేశామని, లోకసభ స్పీకర్ తప్పనిసరిగా వీటిని ఆమోదిస్తారనే ఆశాభవం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రజల్లోకి వెళతామని, ప్రజలతో మమేకమవుతామని స్పష్టం చేశారు. అలాగే ప్రత్యేక హోదా కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు.