జాతీయ వార్తలు

కాపు వర్గానికే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కాపు వర్గానికి చెందిన నాయకుడిని నియమించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజులలో ఒకరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి లభించవచ్చునని అంటున్నారు. కంభంపాటి హరిబాబు మంగళవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర జనాభాలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నందున రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని కాపులకే కేటాయించాలని జాతీయ నాయకత్వం గట్టిగా భావిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కమ్మ వర్గంతోపాటు మరికొన్ని వర్గాలు మద్దతు ఇవ్వటం తెలిసిందే. తెలుగుదేశం పాలనపట్ల కాపులు అసంతృప్తితో ఉన్నారని బీజేపీ భావిస్తోంది. తమను బీసీ జాబితాలో చేర్చకపోవటంతోపాటు రాజకీయంగా తమకు సమచిత స్థానం కల్పించటంలో తెలుగుదేశం విఫలమైందనేది కాపుల అభిప్రాయమని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాపు వర్గానికి చెందిన నాయకుడిని రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించటం రాజకీయంగా తమకు కలిసి వస్తుందన్నది బీజేపీ అధినాయకత్వం యోచన. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంతో తమకు ఇంతకాలం ఉన్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని హరిబాబును పార్టీ అధ్యక్షుడుగా కొనసాగించామని బీజేపీ సీనియర్ నాయకుడు చెప్పారు. హరిబాబును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నట్లు సదరు నాయకుడు వెల్లడించారు. వాస్తవానికి ఇంత క్రితం చేపట్టిన మంత్రివర్గం విస్తరణలోనే హరిబాబును మంత్రివర్గంలో చేర్చుకోవలసింది, ఆ విషయాన్ని ఆయనకు చెప్పటం కూడా జరిగింది. అయితే ఆఖరు క్షణంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాల మూలంగా హరిబాబును అప్పట్లో మంత్రివర్గంలో చేర్చుకోలేకపోయారని ఆయన చెప్పారు.