జాతీయ వార్తలు

రాష్ట్ర నాయకులు వద్దన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు తనంతటతానే ఎన్‌డీఏ నుంచి తప్పుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోని 80శాతం టీడీపీతో పొత్తు వద్దని స్పష్టంగా చెప్పారని ఆయన వెల్లడించారు. టీడీపీతో తెగదెంపులు జరిగిన తరువాత పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి మార్పు అనివార్యమైందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. కొత్త అధ్యక్షుడి ఎం పిక కోసమే హరిబాబు తన పదవికి రాజీనామా చేశారని అమిత్ షా చెప్పారు. హరిబాబుకు త్వరలోనే సముచిత స్థా నం లభిస్తుందని చెప్పడం గమనార్హం. ఇదిలాఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తమకు ఎలాంటి గొడవ లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత బాగా పెరిగిపోతోందని ఒక విలేఖరి పేర్కొన్నగా, మొదట్లో అలాగే అనిపిస్తుంది కానీ తరువాత తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ధీమాను అమిత్ వ్యక్తం చేశారు. లింగాయత్ వర్గానికి చెందిన ముఖ్యమైన నా యకులంతా బీజేపీతోనే ఉన్నారని ఆయన తెలిపారు.

సులభతరంగా జీఎస్టీ అమలు: ఈటల
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: జీఎస్టీ అమలువల్ల క్షేత్రస్థాయిలో వ్యాపారులకు, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జీఎస్టీ అమలువల్ల ఉత్పన్నమవుతున్న ఇబ్బందులు పరిష్కరించేందుకు ఏర్పాటైన వి విధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ఉప సంఘం ఢిల్లీ లో సమావేశమైంది. అనంతరం ఈటల మాట్లాడుతూ జీఎస్టీ అమలువల్ల ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొనేందుకు ట్యాక్స్ కన్సల్టెంట్లను, ఫిక్కి, సీఐఐ సంస్థల ప్రతినిధులను ఆ హ్వానించారని, వారిచ్చిన సలహాలను వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించి, ఆమోదించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ చర్యలద్వారా జీఎస్టీ అమలును సులభతరం చేస్తామని అన్నారు. పన్ను చెల్లింపుదారులకు, ట్రేటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పన్ను ఎగవేతలకు అస్కారం లేకుండా చర్యల తీసుకుంటామని వెల్లడించారు. సామాన్యులకు, పన్ను కట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లే కుండా జీఎస్టీ అమలు కావాల్సివుందని మంత్రి పేర్కొచారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలను 25 నుంచి 20 శాతానికి తగ్గించడం సరికాదని అన్నారు. 15వ ఆర్థిక సంఘం రావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రాల హక్కుల్ని హరించేలా ఆర్థిక సంఘం నిర్ణయాలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎకరానికి రూ.4వేలు పంట పెట్టుబడిగా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో నగదు కొ రత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.