జాతీయ వార్తలు

మైత్రిలో కొత్త మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ముఖచిత్రానే్న మార్చేయనుంది. డోక్లాం, అరుణాచల్, ఎన్‌ఎస్‌జీ ఇలా ఎన్నోవివాదాల నేపథ్యంలో మోదీ-జిన్‌పింగ్‌ల శిఖరాగ్రం ఎలాంటి సందేశాన్నిస్తుందో!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: భారత్-చైనాల మధ్య సరికొత్త అనుబంధానికి శ్రీకారం చుట్టే బృహత్తర లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనకు గాను గురువారం నాడు బయలుదేరా రు. శుక్ర, శనివారాల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ అత్యంత కీలక చర్చలు జరపడంతోపాటు ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న డోక్లామ్ తదితర వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇతర అంశాలపై నెలకొన్న విభేదాలను నివృత్తి చేసుకునేందుకు ఇరుదేశాల నేతలు ఈ భేటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. పర్యటనకు బయలుదేరే ముందు మాట్లాడిన మోదీ భారత్-చైనా సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లడంతోపాటు దీర్ఘకాలిక అంశాల ప్రాతిపదికగానే ఎప్పటికప్పుడు మెరుగుపరచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైనా అధ్యక్షుడితో తాను జరపబోయే ఈ శిఖరాగ్ర భేటీకి అనేక రకాలుగా ప్రాధాన్యత ఉందని, ద్వైపాక్షిక అంశాలతోపాటు అంతర్జాతీయ అంశాలనూ తాము చర్చిస్తామన్నారు. ప్రస్తుత భవిష్యత్ అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపైన తాము లోతుగా చర్చిస్తామని తెలిపారు. డోక్లామ్‌తోపా టు ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలపైనా భారత్-చైనాల మధ్య విభేదాలున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాది జైషే మహ్మద్ విషయంలో చైనా ధోరణిని భారత్ ప్రతిఘటించింది. అలాగే భారత్‌కు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం విషయంలోనూ చైనా మోకాలడ్డుతూ వచ్చింది. ముఖ్యంగా చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కారిడార్ నిర్మాణంతోపాటు 50 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మిస్తున్న చైనా ఆర్థిక కారిడార్‌నూ భారత్ వ్యతిరేకించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా ఇది సాగడమే భారత్ అ భ్యంతరానికి కారణం. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు విఘాతం కలిగించే ఏ ప్రాజెక్టునూ తాము ఒప్పుకోమని భారత్ తెలిపింది. జిన్‌పిం గ్-మోదీల మధ్య జరిగే ఈ శిఖరాగ్ర భేటీ గత వి భేదాలకు స్వస్తిపలికి సరికొత్త రీతిలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని, సామరస్యాన్ని పెంపొందించగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.