జాతీయ వార్తలు

బ్రహ్మజ్ఞానికి అది పాపం కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోథ్‌పూర్, ఏప్రిల్ 26: అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్షకు గురైన ఆశారామ్ బాపూకు సంబంధించి దిగ్భ్రాంతి కలిగించే ఎన్నో విషయాలు బయటికి వస్తున్నాయి. తనలాంటి బ్రహ్మజ్ఞాని అత్యాచారానికి పాల్పడడం తప్పుకాదన్న ఆశారాం బాపు భావనగా కనిపిస్తోంది. కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ సాక్షి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆశారామ్ బాపూ మందులు వాడేవాడని అసోంకు చెందిన ఈ ప్రాసిక్యూషన్ సాక్షి రాహుల్ కె.సచార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు వెలువరించిన 453 పేజీల సుదీర్ఘ తీర్పులో అనేక అంశాలను విఫులంగా ప్రస్తావించారు. ఐదేళ్ల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపినందుకు ఆశారాం బాపూ ఆయన ఇద్దరు అనుచరులకు శిక్ష విధించిన కోర్టు ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావించింది. తాను ఆశారాం బాపూకు చాలా సన్నిహితంగా మెసిలానని 2003లో రాజస్థాన్‌లోని పుష్కర్, హర్యానాలోని భివాణి, గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆశ్రమాల్లో ఆయన బాలికలపై అత్యాచారం జరపడాన్ని తాను చూసినట్లుగా ఈ సాక్షి వెల్లడించారు. ఇందుకు సంబంధించా ఆ బాలికలకు ఆయన సంకేతాలు ఇచ్చేవాడని, ఎవరిపైనైతే టార్చిలైట్ పడిందో ఆ పిల్లను ఆయన వద్దకు తీసుకెళ్లేవారని ప్రాసిక్యూషన్ సాక్షి తెలిపారు. ఈ ముగ్గురిలో తనకు నచ్చిన బాలికను ఎంపిక చేసుకోవడానికి వారితోపాటే ఆశ్రమమంతా తిరిగేవాడని పేర్కొన్న ఈ సాక్షి ‘ఓ రోజు నేను ఓ ఆశ్రమం గోడెక్కాను.. ఆ సమయంలో ఆశారాం బాపూ ఓ బాలికపై అత్యాచారం చేస్తుండడాన్ని చూశాను’ అని తెలిపారు. దాంతో మనసు విరిగిన తాను ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ఆయనకు లేఖ రాశానని, ఆ లేఖ చదివిన ఆశారాం బాపూ దాన్ని పట్టించుకోలేదన్నారు. రెండోసారి రాసిన లేఖకు కూడా ఆశారాం నుంచి సమాధానం రాలేదని, దాంతో తాను నేరుగానే ఆశాంరాంను కలుసుకుని ఈ అత్యాచారాన్ని నిలదీశానని అన్నారు. ‘బ్రహ్మజ్ఞానికి ఇలాంటివి చేయడం వల్ల ఎలాంటి పాపం ఉండదు’ అని ఆయన చెప్పాడని, ఆ తర్వాత తనను బయటకు గెంటించేశాడని ఈ సాక్షి వెల్లడించారు. ముఖ్యంగా అసలు బ్రహ్మజ్ఞానికి లైంగిక వాంఛలేమిటంటూ తను అడిగిన ప్రశ్న ఆయనకు ఆగ్రహం కలిగిందని అన్నారు. ఈ వివరాలన్నీ ఈ సాక్షి కోర్టుకు నివేదించారు. లైంగిక శక్తిని పెంపొందించుకోవడానికి ఓపీఎం వాడేవాడని, దానికి ఓ కోడ్ సంకేతం కూడా ఉండేదని తెలిపారు. ఆశారాంతో ఉన్న ఈ ముగ్గురు బాలికలు అనేకమందికి గర్భస్రావం కూడా చేయించారని ఈ సాక్షి తెలిపారు. ఆశ్రమాన్ని వదిలిన తర్వాత తనపై 2004లో దాడి జరిగిందని, తాను చేసిన ఫిర్యాదును పోలీసులు సైతం పట్టించుకోలేదని తెలిపారు.