జాతీయ వార్తలు

‘లివా మిస్ దివా యూరివర్స్’గా మంగళూరు సుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: 2020 సంవత్సరానికి ‘లివా మిస్ దివా యూరివర్స్’ కిరీటాన్ని మంగళూరుకు చెందిన అడ్లిన్ కేస్టెలినో కైవసం చేసుకుంది. ఇక్కడి వైఆర్‌ఎఫ్ స్టూడియోస్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గత పోటీల విజేత వర్టికా సింగ్ కేస్టెలినోకు మకుట ధారణ చేసింది. జబల్‌పూర్‌కు చెందిన ఆవ్రితి చౌదరి ఈ పోటీల్లో కేస్టెలినోకు చేరువగా వచ్చింది. చివరికి మిస్ దివా సూపర్‌నేషనల్ టైటిల్‌ను దక్కించుకుంది. పూణేకు చెందిన నేహా జైస్వాల్ మిస్‌దివా రన్నరప్ కిరీటాన్ని దక్కించుకుంది. రోషినీ షరాన్ ఆమెకు కిరీటాన్ని ధరింపజేసింది. ఇలావుండగా కేస్టెలినో మనదేశం తరపున ఈఏడాది జరిగే విశ్వసుందరి పోటీల్లో పాల్గొంటుంది. అలాగే ఆవ్రితి చౌదరి సైతం మనదేశం తరపున ఆ పోటీల్లో పాల్గొంటుంది. కాగా బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి లారాదత్తా, ఆంటోనియా పోర్సిల్డ్, ఆశాభట్, డిజైనర్లు శివన్ భాటియా, నరేష్ కుక్రేజా, నికిల్ మెహ్రా, నటులు యామీ గౌతం, ఆదిత్యరాయ్ కపూర్, అనిల్ కపూర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీల కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఈ సారి తప్పనిసరిగా మనదేశానికే ఆ మకుటం దక్కుతుందని లారాదత్తా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.