జాతీయ వార్తలు

గాంధీ పేరే మరిచారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 24: సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ విజిటర్స్ పుస్తకంలో రాసిన సందేశంలో మహాత్మాగాంధీ పేరును ప్రస్తావించకపోవడం అందరికీ విస్మయాన్ని కలిగించింది. ‘నా స్నేహితుడు నరేంద్ర మోదీకి అద్భుతమైన పర్యటన ఏర్పాట్లకు కృతజ్ఞతలు’ అని మాత్రమే ట్రంప్ రాశారు. ఎప్పుడైతే ట్రంప్ సందేశంలో గాంధీ పేరు లేదో ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడి హోదాలో బరాక్ ఒబామా ముంబయిలోని మణిభవన్ (ఒకప్పుడు గాంధీ బస చేసినది) సందర్శించి ‘మహాత్ముడు కేవలం భారత్‌కే కాదు.. యావత్ ప్రపంచానికే హీరో. ఆయన స్ఫూర్తి నిరుపమానం’ అని రాశారు. ఎప్పుడైతే ట్రంప్ సందేశంలో గాంధీ పేరు లేదో అసలు ఆయనకు మహాత్మాగాంధీ అంటే ఎవరో తెలుసా అనే విమర్శలు మొదలయ్యాయి. దీనిపై ట్విట్టర్‌లో అనేక వ్యంగ్యోక్తులు స్వైరవిహారం చేశాయి.

*చిత్రం...సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న దృశ్యం