జాతీయ వార్తలు

రాష్ట్రపతి దృష్టికి ఈశాన్య ఢిల్లీ ఘటనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ రాజధానిలోని ఈశాన్య ఢిల్లీలో మూడు రోజుల పాటు కొనసాగిన అల్లర్లపై ప్రతిపక్షాలు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పిర్యాదు చేయనున్నాయి. ఢిల్లీ అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా చేత రాజీనామా చేయించాలని వారు రాష్టప్రతిని కోరనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అల్లర్లను అదుపు చేయటంలో ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్నాయి. బీజేపీ స్థానిక నాయకులు రెచ్చగొట్టే ప్రకటనల వల్లే ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయని కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్‌వాదీ తదితర పార్టీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ బుధవారం నాడే రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేసి, అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఎన్‌డీఏ ప్రభుత్వంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వైఫల్యంపై ఫిర్యాదు చేయాలనుకుంది. అయితే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం నాడు తీరిక లేకుండా ఉండటంతో కాంగ్రెస్‌కు గురువారం ఆయన అపాయింట్‌మెంట్ లభించింది. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో పార్టీ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తదితరులు రాష్టప్రతిని కలువనున్నారు.
అలాగే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్‌సీపీ అధినేత శరరద్ పవార్ గురువారం రాష్ట్రపతిని కలువనున్నారు. ఈశాన్య ఢిల్లీలో మూడు రోజులు పాటు కొనసాగిన అల్లర్లకు బీజేపీ బాధ్యత వహించక తప్పదని వారు రాష్ట్రపతికి స్పష్టం చేయనున్నారు.