జాతీయ వార్తలు

నోయడాలో పసిడి గోల్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పారిశ్రామిక నగరం నోయిడాలోని ఓ సెజ్‌లో భాగమైన ఓ కంపెనీపై దాడి చేసిన అధికారులకు విస్మయం కలిగేలా పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నల్లధనం లభించాయి. నోయిడాలోని శ్రీలాల్‌మహల్ లిమిటెడ్‌లో ఈ బాగోతం వెలుగు చూసింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగిన తరువాత నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు పెద్ద ఎత్తున ఈ కంపెనీ డబ్బు, బంగారం బదలాయింపునకు పాల్పడింది. నవంబర్ 8నుంచి ఈ కంపెనీ దాదాపు రూ. 140కోట్ల విలువైన 430 కిలోల పన్ను రహిత బంగారాన్ని మార్కెట్‌లో అమ్మేసింది. ఈ అభియోగాలపై డెరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) లక్నో జోనల్ యూనిట్ కంపెనీ ప్రాంగణంతో పాటు, యాజమాన్యానికి చెందిన నివాస సముదాయాలపై దాడులు జరిపింది. కంపెనీ అధికారుల ఇళ్లపైనా సోదాలు నిర్వహించింది. ‘‘పెద్ద నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత శ్రీలాల్‌మహల్ లిమిటెడ్ సుమారు రూ.140 కోట్ల విలువైన 430 కిలోల పన్ను రహిత బంగారాన్ని మార్కెట్లో చట్టవ్యతిరేకంగా అమ్మేసింది. ఈ అభియోగాలపై గురు శుక్రవారాల్లో రెండు రోజుల పాటు జరిపిన దాడుల్లో రూ.2.48కోట్ల పాత నోట్లు, రూ.12లక్షల కొత్త నోట్లు లభ్యమయ్యాయి. దీంతో పాటు 80 కిలోల వెండి, 15 కిలోల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అంతే కాకుండా ఆర్టీజిఎస్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు బ్యాంకుల ద్వారా వివిధ ఖాతాలకు బదిలీ చేయటం ద్వారా రద్దయిన పెద్ద నోట్ల అక్రమ మార్పిడికి పాల్పడింది.’’ అని డిఆర్‌ఐ ఒక ప్రకటన విడుదల చేసింది. పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8న ఈ కంపెనీ నుంచి మరో కంపెనీ 24కిలోల బంగారు నాణాలు, కడ్డీలను కొనుగోలు చేసినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. పాత నోట్లను తెలుపు చేసుకునేందుకు దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్యసంస్థ ఎంఎంటిసి ద్వారా మార్కెట్‌లో భారీ మొత్తంలో బంగారాన్ని అమ్మేసినట్లు స్పష్టమైందన్నారు. కంపెనీకి చెందిన డైరెక్టర్లు అంతా జబ్బులొచ్చాయంటూ ఆసుపత్రుల్లో చేరటమో లేక విచారణ నుంచి తప్పించుకోవటమో చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇద్దరు డెరెక్టర్లను మాత్రం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వారు వివరించారు.