జాతీయ వార్తలు

‘కరోనా’తో కలిసొచ్చిన ‘అదృష్టం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెరంపూర్ (పశ్చిమ బెంగాల్), మార్చి 22: యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దేశంలోనే అత్యధిక కేసులు కేరళలో నమోదుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇజారుల్ సీక్ (30) అనే నిరుపేద వ్యక్తి ఉపాధి కోసం కేరళకు వెళ్లి జీవనోపాధి పొందుతున్నాడు. కేరళలో కరోనా వ్యాప్తితో భయపడిన సీక్ తన సొంత గ్రామమైన పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్డంగకు వారం క్రితం తిరిగొచ్చేశాడు. తిరిగి వచ్చిన సీక్ బుధవారం అనుకోకుండా ఓ లాటరీ టిక్కెట్ కొన్నాడు. మర్నాడు లాటరీ ఏమైందోనని చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయగా కోటి రూపాయిల లాటరీ తనకు తగిలిందని తేలడంతో అతని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. వెంటనే బెల్డంగ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు లాటరీ తగిలిందనీ, ఈ విషయం ఇప్పటికే అందరికీ తెలిసిపోవడంతో తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. కుమార్తె, భార్య, రిక్షా నడిపే తండ్రి సీక్‌కు ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారం చేసుకొంటూ.. ఓ ఇల్లు కొనుక్కొని.. కొంత సొంత సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయాలని భావిస్తున్నానని పోలీసులకు సమాచారం అందించాడు. కడు పేద కుటుంబంలో జన్మించిన తనకు కోటి రూపాయిల లాటరీ లభించడం పట్ల తానెంతో ఆనందిస్తున్నాననీ.. కేరళలో ఇంతవరకు రోజుకు 500 రూపాయిల చొప్పున కూలి పని చేసుకొంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాననీ.. కరోనా భయంతో సొంత ఊరికి వచ్చిన తనకు కోటి రూపాయిల లాటరీ లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఇజారుల్ సీక్ స్పష్టం చేశాడు.