జాతీయ వార్తలు
విధుల్లో మంత్రులు బిజీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సోమవారం నుండి విధులకు హాజరౌతున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా గత 21 రోజుల నుండి ఇంటి నుండి పని చేస్తున్న మంత్రులు సోమవారం ఉదయం పది గంటలకే తమ, తమ కార్యాలయాలకు చేరుకోవటం గమనార్హం. వీరితోపాటు సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు కూడా తమ విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ రవాణా సౌకర్యం ఉన్న సంయుక్త కార్యదర్శి స్థాయి, అంతకు మించిన స్థాయి అధికారులంతా నుండి విధులకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించటం తెలిసిందే. మిగతా అధికారులు, మూడో తరగతి, నాలుగో తరగతి సిబ్బంది హాజరీని దశల వారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదిలా ఉంటే.. రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిరణ్‌రెజీజు, పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తదితరులు తమ కార్యాలయాలకు చేరుకుని పని ప్రారంభించారు. దాదాపు ఇరవై ఒక్క రోజుల తరువాత తమ, తమ విధులకు హాజరవుతున్న మంత్రులకు బోసిపోయిన కార్యాలయాలు స్వాగతమిచ్చాయి. మామూలుగా ఉద్యోగులతో హడావుడిగా కనిపించే మంత్రుల కార్యాలయాలు కొందరు అధికారులు మాత్రమే రావటంతో నిర్మానుష్యంగా కనిపించాయి.