జాతీయ వార్తలు

సవరణలకు సరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసినట్లు తెలిసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఏపీ భూసేకరణ సవరణ బిల్లు గురించి అధికారులతో చర్చించిన తరువాత తన ఆమోదం తెలిపారని తెలిసింది. రవిశంకర్ ప్రసాద్ ఆమోదముద్ర పడిన వెంటనే ఏపీ భూసేకరణ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపించారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబా హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, న్యాయ శాఖ కార్యదర్శితో చర్చించిన అనంతరం సంతకం చేసినట్లు తెలిసింది. హోంశాఖ కార్యదర్శి సంతకం చేసిన అనంతరం సవరణ బిల్లును హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ పరిశీలనకు పంపించినట్లు చెబుతున్నారు. హన్స్‌రాజ్ అహిర్ సోమవారం ఆ బిల్లు గురించి అధికారులతో చర్చించిన అనంతరం ప్రధాని కార్యాలయానికి పంపిస్తారని, ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం సవరణ బిల్లుకు పచ్చ జెండా ఊపితే అదే రోజు రాష్టప్రతి ఆమోదం కోసం రాష్టప్రతి భవన్‌కు వెళుతుందని అధికారులు చెబుతున్నారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబా ఆమోదం లభించిన భూసేకరణ సవరణ బిల్లుకు ఇతర ఆమోదాలు లభించటం ఆనవాయితీ అని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టానికి పలు సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును 2017లో తయారు చేసింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఈ కొత్త బిల్లుకు కేంద్ర న్యాయశాఖ పలు సందేహాలు వ్యక్తం చేయటంతో దీని ఆమోదంలో జాప్యం జరిగింది.