జాతీయ వార్తలు

దీక్షలా.. ప్రచార సభలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: ఏపీ ప్రభుత్వం నిర్వహిస్త్తున్న నవ నిర్మాణ దీక్షలను ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎన్నికల ప్రచారం సభల్లా మార్చేశారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రజాధనంతో టీడీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. దీక్షల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేయడమే కాకుండా అప్రజాస్వామిక రీతిలో ప్రతిపక్ష పార్టీలను ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుకి ఏ నైతికత ఉందని ప్రతిపక్ష ఎంపీలు రాజీనామాలను ఆమోదింపజేసుకొని ఎన్నికలకు రావాలని సవాల్ విసురుతారని ఆయన నిలదీశారు. ఆయనకు నిజంగా ఎన్నికలకు వెళ్లే చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎంపీ, ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ప్రతిపక్షాలపై చంద్రబాబు విమర్శలు చేయాలనుకుంటే సొంత పార్టీ నిధులతో సభలు నిర్వహించుకోవాలి తప్ప, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సభలు నిర్వహించకూడదని రామకృష్ణ హితవు పలికారు.
సామాన్యునిపై మోయలేని భారం: చాడ
ఎన్‌డీఏ నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సామాన్యుడికి భారంవేస్తూ, కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని మండిపడ్డారు.