జాతీయ వార్తలు

దశలవారీగా ప్లాస్టిక్‌పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: పర్యావరణానికి ముప్పు కల్గిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా నిషేధిస్తామని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. రాష్ట్రంలో 2022 నాటికి పూర్తీ స్థాయిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తామని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీశాఖ నేతృత్వంలో పర్యావరణ పరిరక్షణపై గత నాలుగు రోజులుగా వివిధ సమావేశాలు, సదస్సులు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్న, అజయ్ మిశ్రా, అటవీశాఖ ఉన్నతాధికారులు అజయ్‌మిశ్రా, అశోక్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యకలాపాలను మంత్రి జోగు రామన్న వివరించారు. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యంతో దేశమంతటా పర్యావరణ సమస్యలు ఉత్పన్నవౌతున్నాయని, రేపటి తరానికి పర్యావరణం అనుకూలంగా లేకపోతే మానవుని మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పర్యావరణ పరిరక్షణ కొరకు అన్నిచర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో 23శాతం ఉన్న పచ్చదనాన్ని 33శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు జోగు రామన్న చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ పథకాన్ని తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాడం కోసం పర్యావరణానికి హానీ కల్గించే పరిశ్రమలపై ప్రభుత్వ చర్యలు చేపట్టిందని జోగు వెల్లడించారు.