జాతీయ వార్తలు

ఈ-చెత్త ఉత్పత్తిలో భారత్ ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: మనం వాడి పారేసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వ్యర్థాలు) విడుదలలో ప్రపంచంలోని మొదటి ఐదు స్థానాల్లో భారత్ ప్రథమంగా నిలిచింది. భారత్ సరసన చైనా, అమెరికా, జపాన్, జర్మనీలు మిగిలిన స్థానాల్లో నిలిచాయి. దేశంలో రాష్ట్రాలపరంగా చూస్తే మహారాష్ట్ర 19.8 శాతం ఈ-వ్యర్థాలు విడుదల చేస్తోంది. ఇందులో 47,180 టన్నులను సంవత్సరానికి రీసైకిల్ చేస్తోందని అసోచమ్, నెక్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా వారు ఈ వివరాలను వెల్లడిస్తూ, ఈ-వ్యర్థాల విడుదలలో తమిళనాడు 13 శాతం, ఉత్తరప్రదేశ్ 10.1 శాతం, పశ్చిమ బెంగాల్ 9.8 శాతం, ఢిల్లీ 9.5 శాతం, కర్నాటక 8.9 శాతం, గుజరాత్ 8.8 శాతం, మధ్యప్రదేశ్ 7.6 శాతాన్ని విడుదల చేస్తున్నాయి. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ-వ్యర్థాల పరిమాణం 52.2 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇది సాధారణం కన్నా 20 శాతం అధికం. 2016 లెక్కల ప్రకారం మొత్తం ఈ-వ్యర్థాలలో 20 శాతం మాత్రమే సేకరించి సరైన మార్గంలో రీసైకిల్ చేస్తున్నారు. అయితే మిగిలిన ఈ-వ్యర్థాలన్నీ ఏమైపోతున్నాయన్నది వివరాలు లేవని ఒక నివేదిక వెల్లడించింది.