జాతీయ వార్తలు

వీసాల జారీలో ఎలాంటి మార్పులు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: హెచ్-1బీ వీసా, హెచ్-4 వీసాల జారీలో ఎటువంటి మార్పులు ఉండవు.గత కొంత కాలంగా ఈ రెండు కేటగిరీ వీసాల జారీ ప్రక్రియలో సమూలాత్మకమైన మార్పులు వస్తాయని అమెరికా ప్రభుత్వం సంకేతాలు పంపింది. దీంతో అమెరికా వెళ్లి స్థిరపడిన భారత్‌తో సహా పలు దేశాల ఉద్యోగులు, నిపుణులు తీవ్రమైన ఆందోళనకుగురయ్యారు.కాని ఈ రెండు రకాల వీసాల్లో మార్పులు ఉండవని అమెరికా ప్రకటించింది. ఈ వివరాలను అమెరికా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మేరీకే ఎల్ కారిసన్ వెల్లడించారు. ఉద్యోగాలకు, వర్క్ పర్మిట్లకు సంబంధించిన వీసాలు మంజూరు చేసే సార్వభౌమాధికారం అమెరికా ప్రభుత్వానికే ఉంటుందని ఆయన చెప్పారు. అమెరికా భారత్‌ల మద్య ఉన్నత విద్య-విద్యార్థులకు వీసాల మంజూరు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్-1బి వీసా, హెచ్-4 వీసాల్లో ఎటువంటి మార్పులు చేసే ఆలోచన లేదని, ఇవి యదాతథంగా కొనసాగుతాయని ఆయన విలేఖర్లకు చెప్పారు. హెచ్-4 వీసాపై అమెరికాలో 70వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు. హెచ్-1బి వీసా ఉన్న వారి భార్యలేదా భర్తకు హెచ్-4 వీసా కింద వర్క్ పర్మిట్ ఇస్తారు. ఈరెండు వీసాల్లో మార్పులు తేకుండా ట్రంప్ ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని గతంలోనే కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చిన విషయం విదితమే. స్టూడెంట్స్ వీసా దినోత్సవం సందర్భంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి సమస్యలను చర్చించారు. న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కొతా, ముంబాయిలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాల సిబ్బంది సందర్భంగా అమెరికాలో చదివేందుకు పేర్లను నమోదు చేసుకున్న 4000 మంది విద్యార్థులను ఆహ్వానించారు.