జాతీయ వార్తలు

ఎట్టకేలకు కుమార కేబినెట్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: హెచ్‌డీ కుమారస్వామి బుధవారం ఎట్టకేలకు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కేబినెట్‌లోని 25 మంత్రులను తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 14 మంది, జేడీఎస్‌ను నుంచి తొమ్మిది మందికి మంత్రి పదవులు దక్కాయి. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ వాజుభాయ్ వాలా వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఎలాంటి అట్టహాసం లేకుండా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగింది. బీఎస్పీ, జేపీజేపీ సభ్యుడ్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవేగౌడ మరో కుమారుడు హెచ్‌డీ రెవణ్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సిద్ధరామయ్యను ఓడించి సంచలనం సృష్టించిన జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ దేవేగౌడను కుమారస్వామి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జయమాల మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కుమార కేబినెట్‌లో జయమాల ఏకైక మహిళా మంత్రి. కర్నాటక సంకీర్ణ ప్రభుత్వంలో 15 రోజుల తర్జన భర్జన తరువాత మంత్రుల శాఖలకు సంబంధించి ఓ స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని మొదటి నుంచీ భావించారు. అయితే పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరకు డిప్యూటీ పదవి దక్కింది. అందువల్ల శివకుమార్‌కు కీలకశాఖ దక్కే అవకాశం ఉంది. బుధవారం నాటి విస్తరణ తరువాత కుమారస్వామి కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 27కు చేరుకుంది. మరో ఏడు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. గత నెల 23న కుమారస్వామి, పరమేశ్వర సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.