జాతీయ వార్తలు

వెనక్కి వచ్చేయండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడిన నాయకులంతా తిరిగి పార్టీలోకి రావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడిగా ఉమెన్ చాందీ గురువారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కోశాధికారి మోతిలాల్ వోరా, వీసీ చాకో, కొప్పుల రాజు, రపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, జే.డీ. శీలం, కొండ్రు మురళీ, సాకే శైలజనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉమెన్ చాందీ మాట్లాడుతూ ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్నివిధాలా కృషి చేస్తానని చెప్పారు. ఏపీ ప్రజలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, గత కొంతకాలంగా వివిధ కారణాలవల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చిందన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఏపీ వ్యవహారాల బాధ్యతను స్వీకరించడం సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. అలాగే తనకు నమ్మకం ఉందని రాష్ట్రంలో పార్టీ తిరిగి పుంజుకుటుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు దేశం కూడా ఎదురుచూస్తోందని వెల్లడించారు. ఈ దేశంలో అందరినీ కలుపుకొనిపోయే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని, ప్రస్తుతం దేశానికి లౌకిక ప్రజాస్వామ్య కూటమి అవసరమని, అది రాహుల్ గాంధీ నేతృత్వంలోనే సాధ్యం అవుతుందని ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాందీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులాంతా తిరిగి పార్టీలో చేరి, పార్టీని బలోపేతం చేయాలని ఉమెన్ చాందీ పలుపునిచ్చారు.
నేటి నుంచి ‘ప్రజా వంచన వారం’ రఘువీరా రెడ్డి
టీడీపీ నాలుగేళ్ల ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం నుంచి 15 తేదీవరకు ‘ప్రజా వంచనవారం’ నిర్వహించనున్నట్టు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 12న సీనియర్ నేతలతో ఉమెన్ చాందీ సమావేశమవుతారని, జూన్ 13న ఏపీ కాంగ్రెస్ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని రఘువీరా పేర్కొన్నారు. 11 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉమెన్ చాందీ నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాడనికి అందరితో కలసి పనిచేస్తామని రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు.