జాతీయ వార్తలు

గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు ఏడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: డబ్బుకోసం ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను బెదిరించినట్టు రుజువు కావడంతో గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు న్యాయస్థానం ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించింది. 2002లో ఐదుకోట్ల రూపాయలు ఇవ్వాలని సలేం బెదిరించాడు. ఈ కేసులో అతడిని కోర్టు గత నెల 26న దోషిగా తేల్చింది. గురువారం అడిషనల్ సెషన్స్ జడ్జి తరుణ్ షేరావత్ శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు. ఇదే కేసులో నలుగుర్ని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఛంచల్ మెహతా, మాజిద్ ఖాన్, పవన్ కుమార్ మిట్టల్, మహ్మద్ అష్రాఫ్‌ను న్యాయమూర్తి విడుదల చేశారు. మరో నిందితుడు సజ్జన్ కుమార్ సోనీ కేసు విచారణలో ఉండగానే మరణించాడు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ వాసి అశోక్ గుప్తా అనే వ్యాపారిని అబూసలేం బెదిరించాడు. రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపుతానని సలేం గ్యాంగ్ హెచ్చరించింది. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 387, 506, 507 కింద అభియోగాలు నమోదయ్యాయి. అడ్వొకేట్ ఎఎస్ ఖాన్ నిందితుల పక్షాన వాదనలు వినిపించారు. తన క్లయింట్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఎలాంటి వేధింపులూ ఉండవని పోర్టుగల్ ప్రభుత్వం నుంచి హామీ తీసుకున్న వచ్చిన అధికారులు దాన్ని ఉల్లంఘించారని ఖాన్ కోర్టుకు తెలిపారు. 2005న అబూసలేంను పోర్చుగల్ నుంచి తీసుకొచ్చారు. బలవంతపువసూళ్లు, హత్యలు, కిడ్నాప్ కేసుల్లో సలేం నిందితుడిగా ఉన్నాడు. 1993 ముంబయి వరసు పేలుళ్ల కేసులోనూ అతడు నిందితుడే. ప్రస్తుతం అతడు నావీ ముంబయిలోని టలోజా జైలులో ఉన్నాడు.