జాతీయ వార్తలు

వారిని చంపడానికి వాడింది ఒకే తుపాకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 8: సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య కేసులో ఫోరెన్సిక్ లేబొరెటరీ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. గౌరీ లంకేష్, హైతువాద నాయకుడు ఎంఎం కల్‌బుర్గి ఒకే తుపాకీకి బలయ్యారు. ఇద్దరిపై కాల్పులకు వాడింది ఒకే తుపాకీ అని ఫోరెన్సిక్ లెబొరెటరీ నిర్ధారించింది. దీన్ని సిట్ వర్గాలు వెల్లడించాయి. లంకేష్ హత్య కేసులో కేటీ నవీన్‌కుమార్ అనే వ్యక్తిపై తొలి చార్జిషీట్ నమోదైన సం గతి తెలిసింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన గౌరీ లంకేష్ హత్య కేసును సిట్ దర్యాప్తు చేసింది. ఫోరెన్సిక్ లాబొరెటరీ కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి నివేదిక అందజేసింది. దాన్లో లంకేష్, కల్‌బుర్గిపై కాల్పులు జరిపేందుకు ఒకే తుపాకీ వాడినట్టు తేలింది. లంకేష్, కల్‌బుర్గి హత్యలకు సంబంధం ఉందని తొలిసారి అధికారికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రముఖ హేతువాది కల్‌బుర్గి హత్య జరిగి రెండేళ్ల తరువాత లంకేష్‌కు తుటాలకు బలయ్యారు. 2015 ఆగస్టు 30న ధార్వాడ్‌లో ఆయన ఇంటివద్దే కల్‌బుర్గి(77) హత్యకు గురయ్యారు. 2017 సెప్టెంబర్ 5న గౌరీ లంకేష్(55)ను కాల్చిచంపారు. ప్రముఖు లు ఇద్దర్నీ ఒకే తుపాకీతోనే చంపేశారని అధికారులు చెబుతూ వచ్చారు. చివరికి అధికారికంగా రెండు హత్యలకు పాల్పడింది ఒకే గ్యాంగ్ అని నిర్ధారణకు వచ్చారు. సింగిల్ దేశవాళీ తుపాకీ(7.65 ఎంఎం కాలిబర్ పిస్తోల్ కాట్రిడ్జ్) నుంచి వచ్చిన బుల్లెట్‌లే ఇద్ద ర్నీ బలితీసుకున్నాయని ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యకేసులు నవీన్‌కుమార్‌ను అరెస్టు చేశా రు. హిందూ వ్యతిరేకి కాబట్టే ఆమెను అంతం చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అలాగే రచయిత, హేతువా ది ప్రొ. కేఎస్ భగవాన్ హత్యకు పథకం వేసిన ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.