జాతీయ వార్తలు

చైనాపై వైఖరిలో మార్పు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చైనా-పాక్ మధ్య ఏర్పడుతున్న బంధం నేపథ్యంలో భారత్‌దేశం చైనా పట్ల తన వైఖరిపై ఎలాంటి సమీక్ష జరపదని దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ) కింద ఇరుదేశాలు పలు కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో చైనాతో తమ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని, భారత్ దీనిపై ఎలాంటి సమీక్ష నిర్వహించదని అన్నారు. స్థానికంగా జరిగిన ‘చెన్నై సెంటర్ ఫర్ చైనా స్టడీస్’ సంస్థ పదో వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ తమ పొరుగుదేశాలకు చైనా చేస్తున్న ఆర్థిక సహాయం విషయంలో తాము అప్రమత్తంగా ఉండి పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం పాక్‌తో చైనాకు ఏర్పడుతున్న మైత్రి సంబంధం, చైనాతో తమకు ఉన్న బంధంపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ఈ విషయంలో మరో ఆలోచనకు తావు లేదన్నారు. సీపీఈసీ కింద పాక్‌లో వౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వాణిజ్య సంబంధాల మెరుగుకు చైనా సహాయం అందజేస్తోంది. పాక్ నైరుతి ప్రాంతంలోని గ్వదర్ నుంచి చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతాన్ని కలిపే కారిడార్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం నుంచి వెళ్తుంది. అయితే ఈ ప్రాంతం తమదని ఇప్పటికే భారత్ పలుసార్లు ప్రకటించింది. తమ పొరుగు దేశాలకు చైనా ఇలాంటి పలు ప్రాజెక్టులలో సహాయం చేయడం ఆ దేశంతో సంబంధాలు పటిష్టపర్చుకోవడానికి ఉద్దేశించినవి కావచ్చునని, అయితే తాము ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం పాక్ మిలటరీ ఆయుధాలు, ఇతర సామగ్రి కోసం చైనాపై ఆధారపడటం ఎక్కువైందని అన్నారు. గత నెలలో ప్రదాని మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారని, ఈ సమావేశంతో కచ్చితంగా దీర్ఘకాలంలో ఇరుదేశాలకు ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. అలాగే గత ఏప్రిల్‌లో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో కలిసి తాను చైనాలో జరిగిన సమావేశంలో ఆ దేశంతో సంబంధాలపై జరిపిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, ఇరు దేశాల మైత్రీ బంధం మరింత పటిష్టమైందని మంత్రి సీతారామన్ చెప్పారు.